కంగ‌నా ర‌నౌత్‌...వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్‌ ‘క్వీన్‌’. సంద‌ర్భం ఏదైనా త‌న‌దైన శైలిలో వివాదం సృష్టించే కంగనా తాజాగా మ‌ళ్లీ ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లోకి ఎక్కారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ధరించిన ఓ చీర గురించి ఇంటర్‌నెట్‌లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె కట్టుకున్న చీర కేవలం రూ. 600 విలువ చేసే ఓ చేనేత చీర కావడం విశేషం. ఆమె చచీర ఎంత స్పెష‌లో...ఆమె వాచీ కూడా అంతే స్పెష‌ల్‌ కావ‌డంతో ట్రోలింగ్ జ‌రుగుతోంది.కోల్‌క‌తాలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ కంగ‌నా సోద‌రి చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 


ఓ ఫోటో షేర్ చేస్తూ కంగనా సోదరి రంగోలి త‌న సోద‌రి గురించి పొగిడింది. ‘కంగన కోల్‌కతాలో రూ.600కు ఈ చీరను కొనుగోలు చేసింది. ఇంత మంచి చీరలు అంత తక్కువకే దొరుకుతాయని తెలిసి తను చాలా ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను  నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై తను చాలా బాధపడింది’ అంటూ ట్వీట్‌ చేసింది. అయితే, ఈ ట్వీట్‌కు నెటిజ‌న్ల నుంచి విభిన్న‌మైన స్పంద‌న వ‌చ్చింది. రంగోలి ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె చీర‌పై స్పందించారు.


కంగ‌నా ధ‌రించిన చీర గురించి ప్ర‌స్తావిస్తూ...‘కంగ‌నా ధరించిన చీర ఖరీదు రూ.600 సరే బాగానే ఉంది. మరి ఆమె చేతిలో పట్టుకున్న ప్రాడా హ్యాండ్‌ బ్యాగ్‌ 2-3లక్షల రూపాయల ఖరీదు చేస్తుంది. సన్‌ గ్లాసెస్‌, చెప్పులు అన్నింటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మీరు మాత్రం కేవలం చీర గురించే గొప్పగా చెప్తున్నారు. ఏది ఏమైనా మీ ప్రచారం కూడా చాలా అమూల్యమైనదే’ అంటూ నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: