బ్యూటీ ఎదురుగా ఉంటే గుడ్ బాయ్ కూడా బ్యాడ్ బ్యాడ్ అయిపోతాడు. కవ్విస్తూంటే  ఇంకా రెచ్చగొడుతూంటే వెరీ బ్యాడ్ బాయ్ అయిపోతాడు. ఆమె అలాంటి ఇలాంటి బ్యూటీ అసలే కాదు, మెరుపులకు స్ప్రింగులు తొడిగి గాల్లో ఎగరేస్తే అచ్చం ఆమెలాగానే డ్యాన్స్ చేస్తుంది. ఒళ్ళంతా విరగదీసి మరీ మోత్తెక్కించేస్తుంది. ఆమె పేరు జాక్వలైన్. ఎంతో మంది బ్యాడ్ బాయ్స్ ని  అలాగే లైన్లో పెట్టింది. ఆమెకు ప్రభాస్ ఒక లెక్కా. అందుకే షేక్ చేసి పారేస్తోంది.


శ్రీలంక బ్యూటీ జాక్వలైన్ సాహోలో బ్యాడ్ బాయ్స్ సాంగ్ అదరగొట్టేసింది. ఈ సాంగ్ తో యూట్యూబులే అదిరిపోతున్నాయి. నార్త్ సౌత్ తేడా లేకుండా షేక్ చేస్తున్నాయి. ఈ ఒక్క పాట సాహోని నిలబెట్టేస్తుందని అంటున్నారు. అంతలా వెర్రెక్కించే ఈ అమ్మడు చాలా కాలంగా మూవీస్ కి దూరంగా ఉంటూ ఒక్కసారిగా సాహోలో మెరిసింది. అంతే కాదు మత్తు కళ్ళతో మత్తెక్కించేసింది.


కేవలం ప్రభాస్ కోసమే ఈ సాంగ్ చేశాను అంటున్న జాక్వలైన్ డ్యాన్స్ దమ్మేంటో చూపించించి. కంప్లీట్ సెక్సప్పీల్ తో రోమాంటిక్  ఫోజులతో జాక్వలైన్ ఓ రేంజిలో  రెచ్చిపోయిందనే చెప్పాలి. ఆరడుగుల అందగాడు ప్రభాస్ తో ఢీ కొట్టి మరీ  రెడీ అయిందంటే ఈ శ్రీలంక బ్యూటీ మామూలు  అమ్మాయి కానే కాదంటున్నారు.ఇదిలా ఉండగా సాహో సాంగ్ కోసం రెండు కోట్ల రూపాయలు జాక్వలైన్ తీసుకుందని టాక్.



ఆ మూవీలో యాక్షన్ పార్ట్ ఒక ఎత్తు అయితే రొమాంటిక్ సీన్స్ మరో ఎత్తు. ఈ సాంగ్ ఇంకో ఎత్తు అంటున్నారు. జాక్వలైన్ దాన్ని ఎక్కడికో తీసుకుపోయిందని యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నారుట. బ్యాడ్ బాయ్స్ అంటూ జాక్వలైన్ ఇపుడు ప్రతి  కుర్ర గుండె  తలుపు తట్టేస్తోంది. మరో పది రోజుల్లో థియేటర్లలో కూడా ఎంటరై  అక్కడా తెగ కుమ్మేస్తుంది. అందాక ఆ సాంగ్ టీజర్ ని చూసేయడమే.



మరింత సమాచారం తెలుసుకోండి: