భానుమ‌తిగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భానుమతీ రామకృష్ణ ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు.సెప్టెంబరు 7, 1926 లో ప్రకాశం జిల్లా, ఒంగోలు లో జన్మించింది.


ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళావిశారదుడు.భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.  ఎన్టీరామారావు న‌టించిన మ‌ల్లీశ్వ‌రి చిత్రం తీసుకుంటే మిగ‌తా హీరోయిన్ల‌కు భిన్నంగా ఉన్న మాట‌తీరు, ముఖాభిన‌యాలు  ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అంతేనా! ఆమె న‌ట‌న‌లోని విల‌క్ష‌ణీయ‌త ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. సినిమాలో ఎక్క‌డా ఆవిడ హీరోను తాక‌దు, హీరో ఆమెను తాక‌డు. అది గ‌మ్మ‌త్తుగా ఉంటుంది.


ఆమె గొప్ప‌న‌టి క‌నుక‌! ఎంత గొప్ప న‌టో అంత‌కు మింఇన మంచి ర‌చ‌యిత్రి క‌నుక‌! ఎంత‌టి మంచి ర‌చ‌యిత్రో అంత‌కు మంచి గాయ‌కురాలు, సంగీత విద్వాంసురాలు క‌నుక‌! ఇంకా ఆమె వాస్తు అభ్య‌సించిన వ్య‌క్తి. మాన‌సిక శాస్త్రాన్నిఅధ్య‌య‌నం చేసిన వ్య‌క్తి, వేదాంతి . నాడీ శాస్త్రాన్ని ఆపోశ‌న ప‌ట్టిన‌వారు. అన్నిటికీ  మించి ఆమె చిత్ర కారిణి. మ‌హాభ‌క్తురాలు. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత్రిగా ఎంత బిజీగా ఉన్నా స‌మ‌యాన్ని చిక్కించుకుని అపురూప‌మైన చిత్రాల‌ను కూడా చిత్రాక‌రించారు. ఆమె ప‌ర‌మ శివ భ‌క్తురాలు. ఆది శంక‌రాచార్యులు వారి సౌంద‌ర్య‌ల‌హ‌రిని కంఠ‌తా ప‌ట్టి ఆ పై మ‌న‌సుకు జీర్ణించుకున్న ప‌ర‌మ భ‌క్తురాలు. 
భానుమ‌తిగారికి ద‌స‌రాకు బొమ్మ‌ల కొలువు పెట్ట‌డ‌మంటే ఎంత ఇష్ట‌మో! బొమ్మ‌ల కొలువును క‌న్నుల పండువ‌గా, ఎంతో అట్ట‌హాసంగా ఏర్పాటు చేసేవారు. ఆ బొమ్మ‌ల కొలువుకు వ‌చ్చిన వాళ్ల‌ను త‌న వీణా వాద్య నైపుణ్యంతో కాసేపు ఆనంద‌ప‌రిచేవారు. 


 అయితే ఇంత‌టి మేధావి, స‌క‌ల క‌ధా విధ్వాంసురాలైన భానుమ‌తిగారి వివాహం డ్రామా, మెలోడ్రామా, ట్విస్టుల‌తో కూడిన సినిమా క‌థ‌లా సాగింది. ఆ వివాహ సినిమా క‌థా ఇతివృత్తాన్ని ఆమె స్వ‌యంగా చెప్పారు. భానుమ‌తి రామ‌కృష్ణ‌ల వివాహ గాథే భానుమ‌తి  రామ‌కృష్ణ‌గారి జీవితంలో అత్యంత ప్ర‌ధాన‌మైన ర‌స‌వ‌త్త‌ర ఘ‌ట్టం. ఆమె సినిమాలు, పాత్ర‌లు, షూటింగ్స్‌లో జ‌రిగిన విశేషాలు అన్నీ ఒక ఎత్తు కాగా, ఆమె వివాహ ఘ‌ట్ట‌మంతా ఒక ఎత్తుగా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: