బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కు క్రేజ్ ఎక్కువే ఉంది. హిందీలో మంచి మార్కెట్ ఉన్న అనుష్క ఇండియన్ స్టార్ క్రికెటర్, టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. భర్త ఆడే క్రికెట్ మ్యాచ్ లకు హాజరవుతూనే ఉంటుంది. తాజాగా అమ్మడు ఓ బికినీ వేసుకున్న పిక్ ను విరాట్ కోహ్లీ స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది. కారణం ఇదే!

 


పెళ్లైనా అనుష్కకు ఏమాత్రం నాజూకుతనం తగ్గలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పిక్స్ ను పోస్ట్ చేస్తూంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన తన బికినీ ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. మామూలుగా అయితే బికినీలో అనుష్కది మతి పోగొట్టే అందమే.. సందేహం లేదు. కానీ చిక్కంతా ఈ బికినీ గురించే వచ్చింది. ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ లో తాను వేసుకున్న బికినీని నెటిజన్లు కంప్యూటర్, ల్యాపీల్లో వాడే వీఎమ్ సీ మీడియా ప్లేయర్ డిజైన్ ఉందని అభివర్ణిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ట్రాఫిక్ కంట్రోల్ కోసం రోడ్ల మీద పెట్టే ట్రాఫిక్ పాయింట్స్ ను కూడా జత చేసి మెమే లతో ట్రోలింగ్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తున్నారు.

 


‘వీఎమ్సీ మీడియా ప్లేయర్ యాడ్ చేస్తున్నావా’, ‘ట్రాఫిక్ సిగ్నలింగ్ కు మోడల్ వా’, అంటూ అనుష్కను ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. అనుష్క గతంలో బోలెడు బికినీలు వేసింది. ఇన్నాళ్లూ బికినీలో అనుష్క అందమే కనిపించిన నెటిజన్లకు ఈసారి వీఎమ్సీ ప్లేయర్ గుర్తోస్తోంది. నెటిజన్లా.. మజాకా!


మరింత సమాచారం తెలుసుకోండి: