మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి టీజర్ నేడు యూట్యూబ్ లో లో రిలీజ్ అయి, ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ తో విపరీతమైన వీక్షకధారణతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు టీజర్ లో ప్రకటించారు సినిమా నిర్మాతలు. ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైనట్లు సమాచారం. తోలి సినిమా మిర్చి నుండి, 

మొన్నటి భరత్ అనే నేను వరకు వరుసగా సూపర్ డూపర్ హిట్స్ కొడుతూ ముందుకు సాగుతున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా, అతి త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు ఈ సినిమాలో మెగాస్టార్ క్యారెక్టర్ మరియు మూవీ ఎలా ఉంటుంది అనే విషయమై ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, కొరటాలతో చేయబోయే ఆ సినిమాలో తొలుత మెగాస్టార్, ఒక స్టైలిష్ లుక్ లో కనపడనున్నారని, ఆ తరువాత సామాజికంగా ప్రజలకు మేలు చేయాలనే భావనతో ఆయన క్యారెక్టర్ మరొక విధంగా మలుపు తిరుగుతుందని అంటున్నారు. 

అయితే ఇది విన్న మనకు, గతంలో కొరటాల, మహేష్ తో తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా అటువంటి స్టోరీ అయితే కాదని, వేరే స్టయిల్లో సాగుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా కొరటాలతో చేయబోయే సినిమాలో మెగాస్టార్ ఈ విధమైన క్యారెక్టర్ లో నటించనున్నారు అనే విషయమై మాత్రం, ఆ సినిమా టీమ్ నుండి అధికారికంగా వెల్లడి కావలసి ఉంది. మరి ఇది కూడా గతంలో షికారు చేసిన పుకార్ల మాదిరి వార్త అవునా కాదనే విషయం మనకు తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: