చిరుత సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనయుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తొలి సినిమాతోనే ప్రేక్షకులతో పాటుగా మెగా ఫ్యాన్స్ ను కూడా తన ఆకట్టుకునే నటనతో ఉర్రూతలూగించారు అనే చెప్పాలి. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటించిన మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి, ఆయనకు విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది. ఇక అక్కడినుండి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న చరణ్, మెల్లగా తన ఇమేజిని పెంచుకుంటూ, నేడు టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరుగా ఎదిగారు. 

అయితే తండ్రి మెగాస్టార్ వలె, బాలీవుడ్ సినిమా రంగంలో కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలి అని భావించి, తొలి సినిమాగా కొన్నాళ్ల క్రితం, అపూర్వ లఖియా దర్శకత్వంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా జంజీర్ అనే సినిమాలో నటించడం జరిగింది. విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, అప్పట్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి, చరణ్ కు బాలీవుడ్ తొలి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆయన మరొక హిందీ సినిమా చేయనే లేదు. ఇక నేడు మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ కోసం ఆ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్, తమ మూవీ టీమ్ తో కలిసి ముంబై విచ్చేసారు. ఆ సందర్భంగా ఏర్పాటుచేసిన మిడియా సమావేశంలో, 

'మీరు కేవలం ఒకే ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో నటించడం ఆపేసారు కదా.. ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇకపై ఇక్కడ సినిమాలు చేయకూడదు అనుకున్నారా' అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు చరణ్ సమాధానమిస్తూ, నిజానికి తనకు జంజీర్ తరువాత కూడా హిందీలో సినిమాలు చేయమని అవకాశాలు వచ్చినప్పటికీ, సరైన కథ లభించలేదని, అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి, దర్శకధీరుడు రాజమౌళి గారి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ కానుందని, అలానే తప్పకుండా ఆ సినిమా తనకు బాలీవుడ్ లో మంచి బ్రేక్ నిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నట్లు చరణ్ చెప్పుకొచ్చారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: