నిన్న విడుదలైన ‘సైరా’ టీజర్ రిలీజ్ అయిన కొద్ది గంటలలోనే రికార్డుల మోత మ్రోగించడంతో మెగా అభిమానులు జోష్ లో ఉన్నారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటలలోనే అన్ని భాషలలోను కలిపి 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఈ టీజర్ లో ఉన్న భావోద్వేగామైన సన్నివేశాలు పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ టీజర్ ను ఎలివేట్ చేసే విధంగా ఉండటంతో ఈ టీజర్ కు వచ్చే హిట్స్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన ఈ టీజర్ లాంచ్ ఫంక్షన్ లో చిరంజీవి దర్శకుడు సురేంద్ర రెడ్డిని రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తూ వేసిన జోక్స్ హాట్ టాపిక్ గా మారాయి.

వాస్తవానికి ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ చాలామటుకు గ్రాఫిక్ వర్క్స్ తో మేనేజ్ చేస్తారని తాను మొదట్లో భావించానని అయితే ఆ యాక్షన్ సీన్స్ అన్నీ తన చేత ఒరిజనల్ గా నటింప చేసి తనకు పెట్టిన స్వీట్ టార్చర్ కు తనకు చరణ్ సురేంద్ర రెడ్డిల పై చాల కోపంగా ఉంది అంటూ జోక్ చేసాడు. ఇదే సందర్భంలో ఫిలిం ఇండస్ట్రీలో పెరిగిపోతున్న భారీ సినిమాల నిర్మాణం గురించి వాటి బడ్జెట్ గురించి మాట్లాడుతూ చిరంజీవి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ఎన్ని వందల కోట్ల బడ్జెట్ తో భారీ గ్రాఫిక్స్ తో సినిమాలు తీసినా ప్రేక్షకులు మూవీకి సంబంధించిన మూల కథలో పట్టు లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాలను చూడటం లేదనీ అభిప్రాయ పడ్డాడు. ఫిలిం మేకింగ్ టెక్నాలజీల విషయంలో ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చినా కథ విషయంలో మటుకు ప్రాధాన్యత లేకుండా సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ మీడియా అత్యంత ఆసక్తికర కథనాలు వ్రాస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: