బిగ్ బాస్ లో మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో ఆలీకి, మహేష్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. నామినేషన్ తర్వాత బాబా భాస్కర్ అప్సెట్ కి గురయ్యాడు. అయితే బాబా భాస్కర్ ని కూల్ చేద్దామనుకున్న ఆలీ వెళ్ళి అతనితో మాట్లాడతాడు. ఆలీకి, బాబా భాస్కర్ కి మధ్య డిస్కషన్ ఒక కొలిక్కి రాదు. బాబా భాస్కర్ చెప్పే విషయం సరిగ్గా అర్థం కాదు. ఆయనకి తెలుగు రాకపోవడం వల్ల ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు.


అయితే బాబా భాస్కర్ పరిస్థితిని అర్థం  చేసుకుని, మహేష్ అసలేం జరిగిందో వివరించడానికి ప్రయత్నిస్తుంటే ఆలీ రెచ్చి పోయాడు. పుల్లలు పెడ్తున్నావంటూ గొడవని మరింత పెద్దది చేసాడు. దాంతో మహేష్ సీరియస్ అయ్యాడు. ఆలీ పెద్ద పెద్ద అరుపులతో తానేం తప్పు చేయలేదన్నట్టుగా ప్రవర్తించాడు. బాబా భాస్కర్ కి హెల్ప్ చేద్దామనుకున్న మహేష్ ని ఈ విధంగా తనకి అనుకూలంగా ఆలీ వాడుకున్నాడు.


టోటల్ గా నామినేషన్ టాపిక్ ని తప్పించి దాన్ని ఒక్క మాటతో  మహేష్ వైపు మళ్ళించే ప్రయత్నం చేశాడు. అప్పుడు అందరూ అసలు విషయం మర్చిపోయి ఈ గొడవ గురించే మాట్లాడుకున్నారు.ఆలీ చేయాలనుకున్నది కూడా అదే. నాదేం తప్పు లేదు.అంతా మహేష్ వల్లే జరిగిందని చెప్పడానికే ఆలీ అంత పెద్దగా అరిచాడు.


అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా ఇష్టం వచ్చినట్టూ అరవడం ఆలీకి అలవాటే. హిమజ విషయంలో ఆలీ ప్రవర్తన అందరికీ తెలిసిందే. అలా అరవడం వలే నాగార్జున ఆలీని హెచ్చరించాడు కూడా. అయినా మళ్ళీ అలానే చేసాడు. ఇప్పుడు కూడా పెద్దగా అరిచి తప్పు తనది కాదని తెలియజేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రేక్షకులు ప్రతీదీ గమనిస్తున్నారనే విషయం మర్చిపోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: