‘సాహో’ రిజల్ట్ గురించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తోందో ప్రభాస్ పెళ్ళి గురించి కూడ అతడి అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆసక్తిని గ్రహించిన మీడియా సంస్థలు కూడా ప్రభాస్ పెళ్ళి పై రకరకాల వార్తలు ప్రచారంలోకి తీసుకు వస్తూ తమ హడావిడిని కొనసాగిస్తూనే ఉన్నారు. 

ప్రభాస్ పెళ్ళి వార్తల పై ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణంరాజు క్లారిటీ ఇస్తూ వస్తున్న వార్తలు అన్నీ గాసిప్పులు మాత్రమే అంటూ తేల్చేసాడు. అయితే ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ గాసిప్పుల వెనుక ఉన్న మూల శక్తి గురించి కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

ప్రభాస్ పెళ్ళి రూమర్ల వెనుక భీమవరంకు చెందిన కొందరు అమ్మాయిల హస్తం ఉంది అంటూ ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ కు తమ అమ్మాయిని ఇస్తామని భీమవరానికి చెందిన అనేక కుటుంబాలకు చెందిన వ్యక్తులు తరుచూ తమ ఇంటికి వస్తారనీ అయితే ఆ పెళ్ళి సంబంధాల విషయంలో తాము పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఇలాంటి రూమర్లను వారు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు అంటూ శ్యామలా దేవి షాకింగ్ కామెంట్స్ చేసింది. 

ఆ రూమర్లలో భాగంగానే ప్రభాస్ పెళ్ళి ఒక ఎన్ ఆర్ ఐ అమ్మాయితో కుదిరింది అని వచ్చిన వార్తలు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ కు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడు తాము పెళ్ళి చేస్తామని ఈ విషయంలో తమ కుటుంబ సభ్యులకు లేని ఖంగారు మీడియాకు ఎందుకు వస్తోందో అర్ధం కావడం లేదు అంటూ ఆమె జోక్ చేసింది. అయితే కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఇంత క్లారిటీ ఇస్తున్నా ప్రభాస్ పెళ్ళి పై వార్తలు అతడి పెళ్ళి అయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: