హను రాఘవపూడి మొదటి సినిమా "అందాల రాక్షసి".ఇది ఒక ట్రైయంగిల్ లవ్ స్టొరి. అందాల రాక్షసి కమర్షియల్ గా హిట్ కాకపొయిన చాలా మంది సినిమా లవర్స్ మరియు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  సినిమా అవకాశలు మాత్రం రాలేదు. ఆ సమయంలో నేచురల్ స్టార్ నాని హను రఘవపూడి ప్రతిభను గుర్తించి "కృష్ణగాడి వీర ప్రేమగాథ"సినిమాకి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. 14 రీల్స్ వాళ్ళు నిర్మించిన ఈ సినిమా సూపర్  హిట్ అయ్యింది. 
ఆ తరువాత హను నితిన్  "లై" సినిమా కి దర్శకత్వం వహించారు.14 రీల్స్ పతాకంపై గోపి ఆచంట మరియు రామ్ ఆచంట "లై"ని నిర్మించారు.నితిన్ అంత  మార్కట్ లేకపొయిన హను రఘవపూడి చెప్పిన కథను నమ్మి ౩౫ కోట్లు  పెట్టరు. కానీ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ప్రోడ్యూసర్స్ కి భారీ నష్టాలు వచ్చాయి. హను సినిమాకి అనవసరంగా ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతాడని పేరు వచ్చింది. 
  తరువత సినిమా శర్వనంద్ తో తీసాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన "పడి పడి లేచె మనసు"  సినిమా కూడా పరాజయం అయ్యింది .దింతో హను రఘవపూడి పై నెగిటివ్ పబ్లిసిటి జరిగింది.  హనుతో సినిమా చేయడానికి నిర్మాతలు, హీరోలెవరూ ఆసక్తి చూపించట్లేదు. 
ఇలాంటి సమయంలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో తనను ఆదుకున్న నానీనే హను నమ్ముకున్నట్లు సమాచారం. నానికి చాలా కాలం క్రితం హను ఒక మిలిటరి నేపధ్యంలో జరిగే కథ లైన్ చెప్పాడని సమాచారం. ఆ లైన్ నానికి చాలా బాగా నచ్చిండంతో .ఇప్పుడు ఆ లైన్ ను ఒక పూర్తి కథ గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని నాని ఓకే చెస్తే,  తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో షూటింగ్ ని కంప్లీట్ చేసేల ప్లాన్ చేస్తున్నాడంటా. ఈ సారి అయినా హను రాఘవపూడికి విజయం వరిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: