బాలీవుడ్ స్టార్ హీరో,  కింగ్ ఖాన్  షారుఖ్ ఖాన్  సాధారణంగా ఎవరి మీద ప్రశంసలు కురిపించడు. కానీ షారుఖ్ , సూపర్ డీలక్స్ సినిమా  లో తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటనకుమాత్రం ఫిదా అయిపోయి  అతని ఫై ప్రశంసలు కురిపించాడు.  ఇటీవల  మెల్ బోర్న్ లో జరిగిన  ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న షారుఖ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ .. విజయ్ సేతుపతి అద్భుతమైన  నటుడంటూ..   నా జీవితం లో నేను చూసిన గొప్ప నటుల్లో అతను  ఒకరు  అంటూ ప్రశంసించాడు. 




ఇక నిన్న ముంబై లో మెగాస్టార్ చిరంజీవి నటించిన  పీరియాడికల్ మూవీ సైరా నరసింహ రెడ్డి టీజర్ ఈవెంట్  జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు విజయ్ సేతుపతి కూడా హాజరైయ్యాడు.  అందులో భాగంగా  విజయ్ నీ  మీడియా ఇటీవల మిమ్మల్ని షారుఖ్ అద్భుతమైన నటుడు అంటూ పొగిడారు దానికి మీ స్పందన ఏంటి అనిప్రశ్నించగా  ...  విజయ్ సమాధానం ఇస్తూ...   బై మిస్టేక్ గా షారుఖ్ ఆలా అని ఉంటాడు అని అనడంతో అక్కడ వున్న వారికి నవ్వు తెప్పించింది. 




ఇక విజయ్ మాట్లాడుతూ ..షారుఖ్ ఖాన్ ఆలా అనడంతో  నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను అది ఊహించలేదు. అసలు నేను ఆయనకు తెలుసోలేదో అనుకున్నా, కానీ ఆయన నా గురించి  ఆలా చెప్పడంతో చాలా ఆశ్చర్యం వేసింది అని పేర్కొన్నాడు.  కాగా  విజయ్ సేతుపతి సైరా లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా. ఈసినిమా తోపాటు ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తమ్ముడు  వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'ఉప్పెన' లలో కూడా నటిస్తున్నాడు  విజయ్ .  








మరింత సమాచారం తెలుసుకోండి: