పవన్ కళ్యాణ్ త్వరలో తీయబోతున్న గబ్బర్ సింగ్-2 లో ఆకస్మిక మార్పు చోటు చేసుకుందన్న వార్తలు టాలీవుడ్ లో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా లోని కీలక పాత్ర విషయంలో పవన్ తో పాటు దర్శకుడు, నిర్మాత ఓ ఆకస్మిక మార్పు చేయాలని నిర్ణయించారట. అత్తారింటికి దారేది హిట్టుతో ఎంతో ఊపుమీదున్న పవన్ ఆలస్యం చేయకుండా తనకు సూపర్ హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ సీక్వెల్ తీస్తున్నాడన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటి దాకా వినిపించిన హీరోయిన్ల పేర్లను పక్కన బెట్టారట. పవన్ కోసం ఓ కొత్త పిల్లను జోడిగా తేవాలని సడన్ గా నిర్ణయించారని సమాచారం. దీని కోసం కాజల్ అగర్వాల్ పేరుతో పాటు మరికొందరిని పరిశీలిస్తున్నారు. పవన్ తో జత కడితే ఇక ఆ హీరోయిన్ పంట పండినట్టే అన్నది అందరికి తెలిసిందే. అది ఇటీవల టాలీవుడ్ కు కొత్తగా పరిచయమైన ప్రణీత విషయంలో అందరు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆలక్కి గాళ్ ఎవరవుతారనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: