బిగ్ బాస్ లో నిన్న జరిగిన నామినేషన్స్ లో అందరి కమ్టే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి రాహుల్. ఎనిమిది ఓట్లతో అందరికంటే ముందున్నాడు. అయితే పునర్నవి, వరుణ్ లు కూడా రాహుల్ ని నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ముగ్గురు చాలా రోజుల నుండి స్నేహంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పునర్నవి, వరుణ్ లతో రాహుల్ కి ఎలాంటి గొడవలు కూడా లేవు. మరి ఎందుకు నామినేట్ చేసారు?


అయితే రాహుల్ ని నామినేట్ చేయడం వెనక భారీ ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. పోయిన వారం చూసుకుంటే రాహుల్, రోహిణిల మధ్య ఎలిమినేషన్ లో టఫ్ కాంపిటీషన్ నడిచింది. రాహుల్ ఎలిమినేట్ అవుతాడనే అందరూ భావించారు. కానీ ఎలాగోలా బతికి బయటపడ్డాడు. అయితే ఈ వారం కూడా రాహుల్ నామినేషన్ లో ఉంటాడని గ్రహించిన రాహుల్ స్నేహితులు రివర్స్ గేమ్ ఆడే ప్రయత్నం చేసారు.
అందరూ కార్నర్ చేస్తే రాహుల్ పై ప్రేక్షకుల్లో సింపతీ పెరిగి ఓట్లు వచ్చే అవకాశముందని భావించారు.


ముఖ్యంగా స్నేహంగా ఉన్న వాళ్లే ఇలా చేసారని తెలిస్తే అప్పుడు మరింత బాగా సింపతీ వర్కవుట్ అవుతుందని ప్లాన్ ప్రకారమే రాహుల్ ని నామినేట్ చేసారు. ఈ విషయం తెలుసుకోవాలంటే రాహుల్ ని నామినేట్ చేయడానికి వాళ్ళు చెప్పిన కారణాలని విశ్లేషిస్తే అర్థం అవుతుంది.
 
కెప్టెన్సీ టాస్క్ లో రాహుల్ సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదని కారణం చెప్పారు. నిజానికి అతనికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. అందులో పునర్నవి, వరుణ్ లు కూడా ఉన్నారు. మరి ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టు ప్రవర్తించారు. ఇదంతా చూస్తుంటే రాహుల్ పై జనాల్లో సింపతీ క్రియేట్ చెయ్యడానికే చేసినట్టుగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: