చిరంజీవి మెగాస్టార్ ఇమేజ్ సంపాదించి మూడు దశాబ్దాలు పైదాటుతోంది. చిరంజీవి చుట్టూ తారాలోకం విహరిస్తుంది. ఆయన కావాలంటే కొండమీద కోతి కూడా దిగివస్తుంది. అలాంటిది చిరంజీవి లాంటి వారికి కూడా కలలు ఉంటాయని, అవి నెరవేరడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని వింటేనే ఆశ్చర్యం వేస్తుంది.


నిజంగానే ఇది నిజం. చిరంజీవికి ఓ మంచి పాత్ర చేయాలన్నది ఆశ. చిరంజీవి మొత్తం కెరీర్ తీసుకుంటే దాదాపుగా అన్నీ కమర్షియల్ హిట్లే ఉన్నాయి. చిరంజీవిలోని టాలెంట్ ని కొంత బయటకు తీసింది దర్శకుడు కె విశ్వనాధ్ తో పాటు, బాలచందర్ లాంటి కొంతమంది దర్శకులే. చిరంజీవితో డ్యాన్సులు చేయించి కాసులు కురిపించుకున్న వారే ఎక్కువ.


అయితే చిరజీవిలో మంచి నటుడు ఉన్నాడని స్వయంక్రుషి, రుద్రవీణ, శుభలేఖ, ఆపభాంధవుడు  వంటి చిత్రాలు నిరూపించాయి. ఇక చిరంజీవి మొత్తం కెరీర్లో చెప్పుకోవడానికి ఈ చిత్రాలే మిగిలాయి. అయితే చిరంజీవిలో గొప్ప నటుడు ఉన్నాడు. ఆ నటుడు ఆకలి తీర్చింది మాత్రం సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ మూవీ కధ చిరంజీవికి కొన్ని దశాబ్దాల ముందే వచ్చిందట.


అయితే ఆనాడు టాలీవుడ్ పరిధి కేవలం తెలుగు రాష్ట్రాల వరకే. దాంతో మెగా స్క్రీన్ మీద కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే భారీ బడ్జెట్ అవుతుందని చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గారట. చిరంజీవి కూడా పెద్ద బడ్జెట్ అని పక్కనపెట్టారట. అయితే ఇన్నాళ్ళకు తండ్రికి అందివచ్చిన కొడుకు రాం చరణ్ తానే నిర్మాతగా మారి చిరంజీవి విశ్వరూపాన్ని సైరా మూవీలో  సినిమాలో చూపించబోతున్నారుట.


దాదాపుగా 250 కోత్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా తనకు పూర్తిగా సంత్రుప్తిని ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. ఈ సినిమా తనకు ఇచ్చిన కొడుకు తన కలను నెరవేర్చారని పొంగిపోతున్నారు. తనకు జీవితకాలం పాటు నిలిచే సినిమా అని అంటున్నారు. చరిత్రలో మనం ఉండకపోయినా చరిత్ర స్రుష్టించాలి అంటూ సైరా టీజర్ ముగింపులో చిరంజీవి చెప్పిన మాటలు ఇపుడు ఆయనకే సరిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: