మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియాడికల్ మూవీ  'సైరా నర్సింహారెడ్డి'  విడుదలకు సిద్దమవుతుంది.  కాగా ఇటీవల  విడుదలైన ఈ చిత్రం యొక్క మేకింగ్ వీడియో  సూపర్ రెస్పాన్స్ ను  తెచ్చుకొనిసినిమా ఫై   అంచనాలను మరింతగా పెంచేసింది.   ఇక నిన్న  విడుదలైన  ఈ చిత్రం యొక్క టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. తెలుగుతోపాటు , హిందీ , కన్నడ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలైన ఈ టీజర్ కు  మంచి రెస్పాన్స్ వస్తుంది. టీజర్ లోని  గ్రాండియర్ విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా తెలుగు తో పాటు కన్నడ ప్రేక్షకులు  ఈ టీజర్  కు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో కర్ణాటక లో అన్ని భాషలకు గాను ఈ సినిమా థియేట్రికల్ హక్కులను  27కోట్లకు సొంతం చేసుకుంది ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ధీరజ్ ఎంటర్ ప్రైజెస్.  ఈసినిమాతో పాటు ప్రభాస్ నటించిన 'సాహో' కూడా ఆక్కడ భారీ స్థాయిలో  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 



బ్రిటిష్ ఫై దండెత్తి  అమరుడైన   స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా  సురేందర్ రెడ్డి  ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నాడు.   ప్రధాన పాత్రలో చిరంజీవి నటిస్తుండగా ఆయనకు జోడిగా  లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది.   వీరితోపాటు  అమితాబ్ బచ్చన్,  జగపతి బాబు , విజయ్ సేతుపతి , సుధీప్, రవి కిషన్, తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.



బాలీవుడ్  మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై  భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య  ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు తో పాటు  అన్ని ప్రముఖ భాషల్లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: