అమితాబ్ బచ్చన్ ఇండియాలో  ఈ పేరు తెలియని వారుండరు. బాలీవుడ్ బిగ్ బి అయిన అమితాబ్ వయస్సు పెరుగుతున్నా సినిమాలు మాత్రం తగ్గించడం లేదు. 76 ఏళ్ల వయసులో కూడా వరుసగా సినిమాలు చేయడం ఆశ్చర్యకరమే! అటు సినిమాలే కాకుండా, ఇటు వ్యాపారప్రకటనల్లోనూ కనిపిస్తూ యువ నటీనటులకు పోటీగా నిలుస్తున్నాడు. అయితే అంత ఫిట్ గా ఉండే అమితాబ్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట.


మన శరీరంలో అత్యంత కీల‌క‌మైన కాలేయం ఆయ‌న‌కు 25 శాతం మాత్ర‌మే ప‌ని చేస్తోంద‌ట‌. 75 శాతం చెడిపోయింద‌ట‌. బిగ్-బికి గ‌తంలో క్ష‌య స‌మ‌స్య సైతం ఉంద‌ట‌. త‌న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెల్ల‌డించాడు అమితాబ్. ఒకప్పుడు నాకు క్షయ, హైపటైటిస్‌ బి వ్యాధులు ఉండేవి. చెడు రక్తం వల్ల అప్పటికే నా కాలేయం 75 శాతం చెడిపోయింది. ఇప్పుడు నేను కేవలం 25 శాతం కాలేయంతో జీవిస్తున్నా.


దాదాపు ఎనిమిదేళ్లు నా అనారోగ్య స‌మ‌స్య‌ల్ని నేను గుర్తించలేకపోయాను. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల నా శ‌రీరానికి చాలా న‌ష్టం జ‌రిగింది. ఐతే ఇవేమీ నివార‌ణ లేని జ‌బ్బులు కావు. క్షయ వ్యాధికి నివారణ ఉంది. కానీ గుర్తించకపోవడం వల్ల నేను నష్టపోయా’’ అని అమితాబ్ చెప్పాడు.ప్పుడు ఇదంతా తాను పబ్లిసిటీ కోసం చెప్ప‌డం లేద‌ని, త‌న‌లా మ‌రొక‌రు న‌ష్ట‌పోకూడ‌ద‌ని, అవగాహ‌న క‌లిగి ఉండాల‌ని చెబుతున్నాన‌ని అన్నాడు.


స‌మ‌యానికి ప‌రీక్ష‌లు చేయించుకుని జ‌బ్బుల్ని గుర్తించ‌క‌పోతే చాలా ప్ర‌మాదం అని ఓ ఆరోగ్య అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మంలో అమితాబ్ అన్నారు. కూలీ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఫైట్ సీన్ చేస్తూ తీవ్ర గాయాల పాలైన అమితాబ్.. చావుకు స‌మీపంగా వెళ్లి త్రుటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అమితాన్ ప్రస్తుతం చిరంజీవి తో కలిసి "సైరా" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: