Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 11:51 am IST

Menu &Sections

Search

చిరంజీవితో 'సై' అంటున్న కార్తీ..! తట్టుకోగలడా!

చిరంజీవితో 'సై' అంటున్న కార్తీ..! తట్టుకోగలడా!
చిరంజీవితో 'సై' అంటున్న కార్తీ..! తట్టుకోగలడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎనభై - తొంభైల్లో చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే వేరే సినిమాల నిర్మాతలు తమ సినిమాకు మరో డేట్ చూసుకునేవారు. మెగాస్టార్ హవాకు దాదాపు వారం పాటు దరిదాపుల్లో ఉండేవి కావు ఏ సినిమాలు. అంతటి స్టార్ డమ్ మెగాస్టార్ ది. త్వరలో మెగాస్టార్ సైరా రిలీజ్ కాబోతోంది. దాని గురించి ఇప్పటినుంచే ధియేటర్ల లిస్టు మొదలెట్టేశారు. కానీ ఓ తమిళ సినిమా చిరంజీవి సినిమాతో పోటీ పడుతోందని వార్తలొస్తున్నాయి.

 


తమిళ నటుడు కార్తీ ఖైదీ అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు ఎప్పటి నుంచో సరైన డేట్ దొరకట్లేదు. ఇప్పుడు ఆ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు కోలీవుడ్ సమాచారం. కార్తీ సినిమాలు తెలుగులో కూడా తమిళ్ తో పాటు ఒకే డేట్ లో రిలీజ్ అవుతాయి. మెగాస్టార్ సైరా రిలీజ్ ను అక్టోబర్ 2 రిలీజ్ అని ప్రకటించేశారు. అయితే సైరా కంటే ముందు కేవలం 5 రోజుల గ్యాప్ తో ఈ సినిమా వస్తుంది. సైరా వచ్చాక చిరంజీవి సినిమా ధాటికి దాదాపు ధియేటర్లన్నీ సైరాతో నింపేయడం ఖాయం. అటువంటప్పుడు చిరంజీవితో పోటీకి కార్తీ తెగిస్తున్నాడా.. ధైర్యం చేస్తున్నాడా.. అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

 


ఇండియాలో భారీగా విడుదలవుతున్న సైరాకు ధియేటర్లు ఎక్కువ కావాలి. తమిళ్ లో కార్తీ సినిమా రిలీజ్ పక్కానే అయినా ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సంశయిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పడు కేవలం రెవెన్యూ కోసమే సినిమా లెక్కలు మారిపోయాయి. ధియేటర్లే ప్రధానం-కలెక్షన్లే ముఖ్యం. దాంతో ఎంత స్టార్ సినిమా అయినా నాలుగు రోజులు అటు ఇటూగానే రిలీజ్ అవుతున్నాయి. మరి ఇంతటి ధియేటర్ల కాంపిటీషన్లో కార్తీ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది.

 


Can Karthi resist Chiranjeevi with syeraa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవి సినీ జైత్రయాత్రకు 41 ఏళ్లు.. ముఖ్య ఘట్టాలివే
రోజాను సినిమాల్లో పరిచయం చేసింది శివ ప్రసాదే..
అయ్యో ఆ నటుడు కనిపించడా..చిన్నబోయిన పార్లమెంట్
"వాల్మీకి" టైటిల్ మార్పు వెనుక అనంతపురం ఎంపీ!
బాలయ్య భామ సెక్సీ స్టిల్ చూడాల్సిందే!
మెగా హీరోల సినిమాలకే ఎందుకిలా జరుగుతోంది..!
"వాల్మీకి" టైటిల్ మార్చినా హిట్ ను అడ్డుకోలేకపోయారు..
"వాల్మీకి" రీమేక్స్ లో హరీశ్ శంకర్ టైమింగ్ సూపర్
"వాల్మీకి" మెగా హీరోలకు భిన్నంగా వరుణ్ ప్రయాణం..
వాల్మీకి: ఫున్నమినాగు చిరంజీవి ని గుర్తుచేసిన వరుణ్ తేజ్!
ఆ సిక్సర్ల సునామీకి 12 ఏళ్లు
రెండే ట్వీట్స్.. 'సైరా'కు బాలీవుడ్ లో బలం పెరిగిపోయింది
టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ తో పూలతోటనే సృష్టించాడు
రాజకీయ సంచలనం.. అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ
వైసీపీ-టీడీపీ మధ్య ముదురుతున్న 'కోడెల' యుధ్దం.
'వాల్మీకి' టైటిల్ పై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
బిగ్ బీ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ ఖరీదైన గిఫ్ట్!
ప్రభుత్వ లాంఛనాలకు కోడెల కుటుంబం నిరాకరణ
రంగీలా ఊర్మిళ 'ఆ' పార్టీలో చేరడం లేదట!
బ్రహ్మానందంకు 'వాల్మీకి' సాయం చేస్తాడా!
బాబు గారూ.. మీకిది తగునా!
డీఆర్డీవో పరీక్షల్లో అపశృతి.. కుప్పకూలిన డ్రోన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.