ఇన్నాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బారీ సినిమా అంటే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన భారీ విజువల్ వండర్ బాహుబలి గురించే ప్రపంచం మొత్తం చెప్పుకుంది. తెలుగోడి సత్తా తెలుగు సినిమాకున్న స్టామినాని మన జక్కన్న నిరూపించాడు. ఇప్పటివరకు నాన్-బాహుబలి అనే పదం మాత్రమే వినపడింది. అంతేకాదు రాజమౌళి లాంటి దర్శకులు మరొకరు మన తెలుగు ఇండస్ట్రీలో లేరు అన్న మాట కూడా బాగా వినిపించింది. వీటన్నిటిని సుజీత్ అనే యంగ్ డైరెక్టర్, సురేందర్ రెడ్డి అనే మరో స్టైలిష్ మేకర్ అనే దర్శకుడు బ్రేక్ చేయబోతున్నారు. నాన్ బాహుబలి రికార్డులు అంటూ బాహుబలిని మినహాయించి కలెక్షన్లు, సెంటర్లు లెక్క వేస్తున్న వాళ్ళకి ఇక బాహుబలిని కూడా కలిపి చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఒకటికాదు, ఏకంగా 2 సినిమాలు సిద్ధమయ్యాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా "నాన్-బాహుబలి" అనే పదం వినిపించదు కనిపించదు.

సాహో, సైరా.. బాహుబలి రికార్డుల్ని టార్గెట్ చేశాయి. సైరా, సాహో ట్రైలర్స్, ప్రీ రిలీజ్ హంగామా, ప్రీ రిలీజ్ క్రేజ్.. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాయి. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న మార్కెట్ ని చూస్తే కచ్చితంగా రికార్డుల వేట కొనసాగుతుందనే చెప్పాలి. ఫస్ట్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్, టోటల్ కలెక్షన్స్, ఓవర్సీస్ కలెక్షన్స్..ఇలా అన్నిటిలో బాహుబలి రికార్డ్స్ ని టార్గెట్ చేశాయి మెగాస్టార్ సైరా, రెబల్ స్టార్ సాహో. అయితే బాహుబలి-2 రికార్డులు కొట్టడానికి వీటికి ఎన్ని అవకాశాలున్నాయో, అన్నే ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. బాహుబలి-2 సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఆసక్తి దేశం అంతా పాకిపోయింది. ఆ ఆసక్తి సునామీలా మారి థియేటర్లను ముంచెత్తింది. ఫలితంగా బాలీవుడ్ సినిమాను కూడా క్రాస్ చేస్తూ భారీ వసూళ్లు సాధించింది బాహుబలి-2.  
 
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా, చిరంజీవి-అమితాబ్ కలిసి నటిస్తున్న సినిమాగా సాహో, సైరాలకు బాలీవుడ్ లో కాస్త క్రేజ్ ఉంది తప్ప.. బాహుబలి-2 టైమ్ లో ప్రేక్షకుల్లో ఉన్నంత ఆతృత మాత్రం ప్రస్తుతం  కనిపించడం లేదు. మన దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటికీ బాహుబలి-2 రికార్డు అలానే ఉండిపోయింది తప్ప ఇంతవరకు ఈ రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అమీర్, సల్మాన్ సినిమాలు కూడా ఇప్పటివరకు ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. 

ఇక సైరా, సాహో సినిమాలకు బాలీవుడ్ లోనే గట్టి పోటీనిచ్చే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు బాహుబలి-2కు దొరికినన్ని థియేటర్లు కూడా నార్త్ లో సైరా, సాహో సినిమాలకు దొరకడం లేదు. సో.. వాస్తవంగా చూసుకుంటే బాహుబలి-2 రికార్డుల్ని కొట్టడం సాహో, సైరా సినిమాలకు కాస్త కష్టమైన పనే. అయితే ఏపీ, నైజాంలో మాత్రం బాహుబలి-2 రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాన్-బాహుబలి అనే పదం ఇక మీదట వినపడకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: