టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్, ఇటీవల కొద్దికాలంగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నితిన్ తో 'గుండె జారీ గల్లంతయ్యిందే ' సినిమా తీసిన దర్శకుడు, కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే రాజ్ తరుణ్ మొన్న అర్ధరాత్రి హైదరాబాద్ శివారులోని నార్సంగి ప్రాంతంలో తన కారును యాక్సిడెంట్ చేసి, 

తరువాత దానిని అక్కడే వదిలి వెళ్లినట్లుగా రెండు రోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆ కారులో ఉంది రాజ్ తరుణ్ ఒక్కరేనా లేక మరెవరైనా ఉన్నారా, మరి అలాంటపుడు కారు యాక్సిడెంట్ కు గురికాగానే ఆయన అక్కడినుండి ఎందుకు పారిపోయారు అనే విషయమై రకరకాల పుకార్లు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, స్వయంగా రాజ్ తరుణ్, ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేసారు. ఆ రోజు రాత్రి తన ఇంటినుండి కారులో బయల్దేరింది నిజమేనని, మూడు నెలలుగా తాను అదే రోడ్డులో తరచు ప్రయాణిస్తున్నానని, అయితే అనుకోకుండా నార్సంగి ప్రాంతం వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని యాక్సిడెంట్ జరిగినదని, 

అయితే ఆ సందర్భంలో ఒక్కసారిగా తన చెవులు మూసుకుపోయాయని, పైగా కారు అద్దం బయట ఏమి జరుగుతుందో కూడా ఆ సమయంలో అర్ధం కాలేదని, అంతేకాక తన హార్ట్ బీట్ కూడా తన కంట్రోల్ లో లేని స్థితిలో, ముందుగా సహాయం కోసం తన ఇంటికి చేరుకోవడానికి అలా పరిగెత్తవలసి వచ్చిందని, ఒకరకంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లనే పెద్ద ప్రమాదం తప్పిందని, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆయన ఒక పోస్ట్ చేసారు. ఇక ప్రస్తుతం తాను ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ మామూలుగానే ఉన్నానని, అతి త్వరలో తన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నానని ఆయన ఆ పోస్ట్ లో తెలిపారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: