ప్రస్తుతం దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.  ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరద ఉదృతి తీవ్రంగా ఉన్నది.  ఎప్పుడు లేని విధంగా ఈసారి వరద తీవ్రత అధికంగా ఉండటంతో..రెస్క్యూ సిబ్బంది వేలాది మందిని రక్షిస్తున్నారు.  వరదల్లో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు చిక్కుకున్నారు. వారు వీరు అని తేడా లేకుండా రెస్క్యూ సిబ్బంది రక్షిస్తున్నారు.  తాజాగా కేరళ నటి మంజు వారియర్ మనాలి వరదల్లో చిక్కుకుపోయింది.  


ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్రికి వెళ్లారు.  అక్కడ రెండు వరాల పాటు షూటింగ్ చేశారు.  అప్పటి వరకు పరిస్థితి అంతా బాగుంది.  కానీ, గత రెండురోజల అక్కడ వావతారణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.  ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో ఆ వరదలో చిక్కుకుపోయారు.  అక్కడి నదులు ప్రమాదస్థాయిని మించి పోవడంతో ఆమె భయపడింది.  


వెంటనే తన సోదరుడికి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేసింది.  ఆమె సోదరుడు సోషల్ మీడియా సహాయం కోరామని చెప్పడంతో మంజు వారియర్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కేంద్ర మంత్రి మురళీ ధరన్ కు తెలియజేసింది.  వెంటనే స్పందించిన మురళీ ధరన్ ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  కేంద్ర మంత్రి విజ్ఞప్తి మేరకు ఆయన అక్కడ దగ్గరలో ఉన్న రెస్క్యూ టీమ్ కు ఆదేశాలు జరీ చేశారు.  


రెస్క్యూ టీమ్ రెస్క్యూ ఆపరేషన్ తో మంజు వారియర్ తో పాటు మిగతా 30 మంది యూనిట్ సభ్యులను కూడా ఈ టీమ్ కాపాడింది.  అక్కడి నుంచి వారిని సురక్షితంగా మనాలి తరలించారు.  ఈ సందర్భంగా మంజు వారియర్ రెస్క్యూ టీమ్ కు ధన్యవాదాలు తెలియజేసింది.  మనాలి నుంచి చిత్ర యూనిట్ అంతా తిరిగి కేరళ వచ్చేసింది.  ఇంకా కొన్ని రోజులపాటు ఉత్తర భారత దేశాన్ని వరదలు అతలాకుతలం చేయబోతున్నాయి.  ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: