వరుణ్ తో శ్రీముఖి బాబా మాస్టర్ ఏడ్చారు అని చెప్పింది. నాలుగు పేర్లు చెప్పమన్నారు అందులో లీస్ట్ ప్రాబ్లం మీరే అనిపించింది. అందుకే చెప్పాననీ బాబా మాస్టర్ తో అలీ అన్నాడు. ఉదయం నేను చెప్పిన వాళ్లు చివరికి ఎవరూ మిగల్లేదని చెప్పాడు. ఎంత చెప్పినా వినకుండా నామినేట్ చేశావని బాబా మాస్టర్ అన్నాడు. ఎప్పుడూ ఫన్నీగా ఉంటానని నన్ను ఇంట్లో జోకర్ అనుకుంటున్నారా అని అడిగాడు. ఇంతలో మహేష్ మాట్లాడుతూ ఉండగా నువ్వు పుల్ల పెట్టకు అని అలీ అన్నాడు. మహేష్ వెళ్లిపోయాడు. రాహుల్ తో ఆయనకు భాష రాదు ఐదుగురు చుట్టుముటి గంట నుంచి ఆయన్ని మాట్లాడనివ్వడం లేదు అని మహేష్ అన్నాడు. నైట్ నా దగ్గర కూర్చొని బాబా మాస్టర్ బాధపడుతున్నారు. నచ్చక పోతే డైరెక్ట్ గా పంపించేయండి.


ఇంకా నామినేషన్ ఎందుకు అని మహేష్ వరుణ్ వాళ్ళతో అన్నాడు. నన్ను పుల్లలు పెట్టొద్దని ఎందుకన్నావ్ నా వల్ల ఎవరూ కొట్టుకున్నారు రా హౌసులో అంటూ అలీతో మహేష్ గొడవపెట్టుకున్నాడు. నువ్వు చేసింది తప్పు. అలా మధ్యలో రాకూడదని అలీ అన్నాడు. నామినేషన్ అనేది ఒక సాధారణమైన ప్రక్రియ, చిన్నదానికే అలా అంటే మరి నాకు ఎనిమిది ఓట్లు పడ్డాయి దానికి నేనైతే పూల్ లో దూకి చావాలి అని రాహుల్ అన్నాడు. 30వ రోజు ఉదయం గాజువాక పిల్ల సాంగ్ తో అందరూ నిద్ర లేచారు. జ్యోతి, శ్రీముఖి కలిసి వితిక పునర్నవిని ర్యాగింగ్ చేశారు. ఓ పాట పాడమని అడిగితే ఇద్దరూ చేతులు కట్టుకుని గాజువాక పిల్ల పాట పాడారు.తరువాత ఇద్దరిని ఒకే స్టెప్ వేయమనగా వాళ్ళు వేశారు.తర్వాత రవిని శ్రీముఖి పిలిచింది.


చేతిలో బాటిల్ ఉన్నంత మాత్రాన అర్జున్ రెడ్డి అనుకోకు సీనియర్స్ పిలిస్తే రావాలి అంది. ఇద్దరూ కలిసి టార్చర్ చేస్తున్నారనీ రవి బాబా మాస్టర్ కి చెప్పాడు. శ్రీముఖి కాలేజీ ప్రిన్సిపల్. జ్యోతి ఆయా అలీ పీటీ సర్ అని బాబా మాస్టర్ అన్నాడు. హౌస్ లో ముప్పై రోజులు ఉండటం వల్ల నామినేషన్ ని ఈజీగా తీసుకోలేకపోతున్నానని వరుణ్ తో బాబా మాస్టర్ అన్నాడు. నాతో క్లోజ్ గా వున్నవాడే నామినేషన్ చేయడం బాధగా అనిపించిందని చెప్పాడు. తరువాత బాబా మాస్టర్ డ్రస్ ని చూసి కమర్షియల్ సినిమాల్లో కాలేజీకి అందులో విలన్ కి సంబంధముండదు,బాబా గెటప్ కూడా అలానే ఉందని అలీ అన్నాడు. పీటీ మాస్టరే కాలేజీలో విలన్ అని ఆ యాం ది హీరో అని మెల్లగా ప్రూవ్ చేస్తానని బాబా మాస్టర్ అన్నాడు. ఈ హౌస్ లో నుంచి ఏం తీసుకెళ్తావ్ ఏం వదిలేస్తాం అని హిమజాను బాబా మాస్టర్ అడిగారు. ఏడుపుని వదిలేశానని గోధుమ అట్టువేయడం నేర్చుకున్నానని హిమజ అంది.తర్వాత ఇంటి సభ్యులంతా కలిసి వరుణ్, వితికా పెళ్లి రోజును సెలబ్రేట్ చేశారు. పాట పాడుతూ వాళ్ళిద్దరితో దండలు మార్పించారు.    ఈ సారి ఇంటి కెప్టెన్ అయ్యే అవకాశాన్ని అమ్మాయిలకు ఇస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. సైరన్ మోగగానే కన్ ఫెషన్ రోమ్ లోని సీట్లో కూర్చునే ఇద్దరు అమ్మాయిలు కెప్టెన్సీ కోసం పోటీ పడతారని అన్నాడు. సైరన్ మోగగానే జ్యోతి, వితిక వెళ్లి సీట్లో కూర్చున్నారు. జ్యోతి నువ్వు కెప్టెన్ అయితే నాకు బెడ్ రూమ్ డైనింగ్ రూమ్ ను ఇవ్వాలని బాబా అడిగాడు. శ్రీముఖి కిచెన్ కావాలని అడిగింది. జ్యోతి వితికాను రెండు క్రెయిన్ల సహాయంతో స్విమ్మింగ్ పూల్ మీద వేలాడతారని కింద ఉన్న సభ్యులంతా వాళ్లు మద్దతిచ్చే వారి కాళ్లను నేలకు తగలకుండా చూసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరు ముందు కాళ్లు కింద పెడతారో వాళ్లు పోటీ నుంచి తప్పుకుంటారని గాలిలో ఉన్న వ్యక్తి కెప్టెన్ అవుతారని అన్నాడు.


బాబా మాస్టర్ తాడును పట్టుకుని ఉండగా రాహుల్ వచ్చి నేను పట్టుకుని కూర్చుంటా వచ్చిన వాళ్ళని మీరు వెళ్లగొట్టండి అన్నాడు. ఇవతల వైపు రవి అలీ తాడును గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. శ్రీముఖి వచ్చి రాహుల్ మొత్తం చుట్టుకుని పిల్లర్ని పట్టుకుని కూర్చున్నాడని చెప్పింది. ఇద్దరిలో ఎక్కువ సేపు ఎవరు ఓపికగా ఉంటారో వాళ్లే కెప్టెన్ అవుతారని రాహుల్ మహేష్ తో వరుణ్ అన్నాడు. ఇక ఉండలేను కిందకి దించమని వితిక అడిగింది. శివజ్యోతి కెప్టెన్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. సభ్యులంతా ఇంటి నియమాలను పాటించేలా చూసుకోవాలని అన్నాడు. రాత్రి బాబా మాస్టర్ పడుకుని ఉంటే సభ్యులంతా వచ్చి చుట్టూ తిరుగుతూ ఆటపట్టించారు. రవి పడుకుని ఉంటే శ్రీముఖి, హిమజ వచ్చి ఆటపట్టించారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ముప్పయ్యవ రోజు ముగిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: