Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 8:38 pm IST

Menu &Sections

Search

ఎట్టకేలకు ఆ సినిమా విడుదలకానుంది

ఎట్టకేలకు  ఆ సినిమా విడుదలకానుంది
ఎట్టకేలకు ఆ సినిమా విడుదలకానుంది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విలక్షణ  దర్శకుడు  గౌతమ్ మీనన్, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన  చిత్రం 'ఎన్నై నోకి పాయుమ్ తొట్ట'.  ఎప్పుడో  విడుదల కావాల్సిన  ఈ చిత్రం  ఆర్థిక సమస్యల కారణాల వల్ల  వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు  ఈ సినిమా  విడుదలకు  అన్ని అడ్డంకులు  తొలిగిపోయాయి. అన్ని  కుదిరితే  సెప్టెంబర్ 6న ఈ చిత్రం  విడుదలకానుందని సమాచారం.  తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రాన్ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదలచేయనుంది. 




శివ సంగీతం అందించిన  ఈచిత్రంలో  మెగా ఆకాష్ కథానాయికగా నటించిన శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఈచిత్రానికి  గౌతమ్ మీనన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా  విడుదలకు  లైన్ క్లియర్ అయ్యింది కానీ   గౌతమ్ మీనన్  దర్శకత్వంలో   తెరకెక్కిన 'ధ్రువ నక్షత్రం' మాత్రం  ఇంకా నిర్మాణంలోనే వుంది. ఈసినిమా  కూడా ఎప్పుడో విడుదలకావాల్సి వుంది కానీ ఆర్థిక సమస్యల వల్ల ఈ చిత్రాన్ని  పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఈ సినిమాను కూడా గౌతమ్ మీనన్ ఎలాగోలా విడుదల చేసేలా చూస్తాడో లేక వదిలిపెట్టేస్తాడో చూడాలి.   





ఇక ధనుష్ ప్రస్తుతం  వరుస సినిమాలతో  బిజీగా వున్నాడు. అందులో భాగంగా ఇటీవల  వెట్రి మారన్  దర్శకత్వంలో 'అసురన్' అనే చిత్రాన్ని పూర్తి చేశాడు.   ఈ చిత్రంలో  ధనుష్  డ్యూయెల్ రోల్ లో నటిస్తుండగా మలయాళ  నటి మంజు వారియర్  ఓ హీరోయిన్ గా  నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ ప్రస్తుతం  దొరై సెంథిల్ కుమార్  డైరెక్షన్ లో  పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం ప్రారంభం కాగా  పంజాబీ బ్యూటీ మెహ్రీన్ ,ధనుష్ కు జోడిగా నటిస్తుంది. కాగా  టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర ఈ చిత్రంలో విలన్ పాత్రలో  కనిపించనున్నాడు. 

danush
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సైరా రన్ టైం లాక్
భారీగా డ్రాప్  అయిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు
లేడీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన  నాగశౌర్య
క్రేజీ ఆఫర్ కొట్టేసిన  గ్యాంగ్ లీడర్  హీరోయిన్
టీ 20ల్లో  సరికొత్త రికార్డులు సృష్టించిన  కోహ్లీ
బిగ్ బాస్ 3 కోసం  వరుణ్, వితిక ఎంత తీసుకుంటున్నారో  తెలుసా.. ?
అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది
స్టోక్స్ జీవితం లో ఇంత విషాదమా ..
సాహో క్లోజింగ్ కలెక్షన్స్
రాజమండ్రి లో ఇండియన్ 2
అల్లు అర్జున్ 20లో రష్మిక పాత్ర రివీల్ ..
నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో అదరగొట్టిన  సైరా
స్లెడ్జింగ్ తో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ -ఆసీస్ ఆటగాళ్లు
సూపర్ స్టార్ మూవీ టైటిల్ ను  వాడుకుంటున్న లేడీ సూపర్ స్టార్
బాక్సాఫీస్ వద్ద  అదరగొడుతున్న  డ్రీం గర్ల్
వినయ విధేయ రామ ఫై సెటైర్ వేసిన తెనాలి రామకృష్ణ
బిగ్ బాస్ 3: కిక్కివ్వని వైల్డ్ కార్డు  ఎంట్రీలు
గ్యాంగ్ లీడర్ లేటెస్ట్ కలెక్షన్స్
రోహిత్ శర్మ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు
నా సినిమా కు బ్యానర్లు కట్టొదంటున్న స్టార్ హీరో
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.