మెగాస్టార్ అయింది ఎనభై దశకంలో. అంతకు ముందు చిరంజీవి సినిమా రంగంలో తన ఉనికి కోసం ఎంతగానో పరిశ్రమిస్తూ వచ్చారు. ఆయన ఫిల్మ్ ఇన్సిట్యూట్లో  నటనలో శిక్షణ పొందాక అవకాశాలు తొందరగారాలేదు. చిరంజీవి రూమ్మేట్ నారాయణరావు మొదట హీరో అయ్యారు. ఆ రోజుల్లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న జయసుధతో ఆయన జంట కట్టి సినిమాలు చేశారు. తరువాత మరో రూమ్మేట్ సుధాకర్ కూడా హీరోగా మంచి అవకాశాలు సంపాదించుకున్నారు. ఇంకో రూమ్మేట్ హరిప్రసాద్ సైతం దాసరి నారాయణరావు నిర్మించిన శివరంజనిలో హీరోగా వెండితెరపైన పరిచయమై  జయసుధ పక్కన నటించే అద్రుష్టాన్ని సంపాదించుకున్నారు.


చిరంజీవికి మాత్రం తొలిదశలో అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే ఆయన పునాది రాళ్ళు సినిమాతో తన కెరీర్ మొదలుపెడితే మొదటిగా రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు సినిమా. ఈ సినిమాలో చిరంజీవికి ఒక పాట కూడా ఉంటుంది. అది చిరంజీవి ఫస్ట్ డ్యూయట్ గా చెప్పుకోవాలి. ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా అంటూ పల్లవితో సాగే  ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. జాలాది రాసిన ఈ గీతానికి చక్రవర్తి స్వర రచన చేశారు.


చిరంజీవి అప్పటికి అప్ కమింగ్ హీరో కాబట్టి ఎస్పీ బాలు తో కాకుండా జి ఆనంద్ చేత ఈ పాటను పాడించారు. ఆయన ఎస్పీ శైలజతో కలసి పాడిన ఈ డ్యూయట్ ఆనంద్ కెరీర్లో కూడా పెద్ద హిట్ సాంగ్ గా నిలిచింది. ఆ తరువాత చిరంజీవి వందలాది సినిమాలులో నటించారు. ఎందరో హీరోయిన్లతో అందమైన పాటలు పాడారు. దాదాపుగా అన్నీ బాలు పాడారు. అయితే చిరంజీవి తొలి పాట మాత్రం ఓ తీపి గురుతే. 


ఆ పాటను పాడిన ఆనంద్ అంటే మెగాస్టార్ కి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నయి. తనకు మొదటిసారి గొంతుక అరువు ఇచ్చిన ఆనంద్ మీద అభిమానంతో ఆనంద్ స్వరమాధురి 5 వేలు కచేరీలు  పూర్తి చేసుకున్న సందర్భంగా 2000 సంవత్సరంలో జరిగిన  హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన ఆర్కేష్ట్రా ఫంక్షన్ కి  చిరంజీవి  ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తాను మొదటి పాట పాడిన హీరో మెగాస్టార్ అయినా కూడా తన పట్ల చూపించిన అభిమానానికి ఆనంద్ ఎపుడూ గర్వంగా ఫీల్ అవుతూంటారు. ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ చెబుతూ ఈ తీయని పాటను గుర్తు చేసుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: