మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించాడు.  తర్వాత పూరి సినిమా లోఫర్ తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నా కమర్షియల్ హిట్ సాధించలేక పోయాడు.  ఫ్యామిలీ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ‘ఫిదా’ సినిమాతో వరుణ్ తేజ్ కి మంచి క్రేజ్ వచ్చింది. 

ఇలా వరుస విజయాలు సాధిస్తున్న వరుణ్ తేజ్ ఈ సంవత్సరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్,వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2 ’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీలో వరుణ్ కామెడీ కి మంచి ఆదరణ లభించింది.  ప్రస్తుతం మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన హరీష్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మద్య వాల్మీకి మూవీకి సంబంధించిన టీజర్ లో వరుణ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

ఈ సినిమాలో నెగిటీవ్ షేడ్ లో కనిపించనున్న వరుణ్ తేజ్ లుక్ పరంగా అచ్చం నాటు రౌడీలా ఉన్నాడు. వాల్మీకి చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండకు రీమేక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. 'జర్రాజర్రా' అంటూ సాగే ఐటెం నంబర్ ఇది. మాస్ ప్రియులకు ఈ పాట మంచి కిక్కు ఇచ్చేలా ఉంది.

డింపుల్ హయతి ఈ సాంగ్ లో వరుణ్ తేజ్ తో నర్తించింది.  సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు.  తమిళ నటుడు అధర్వ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: