మన్మధుడు 2 సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోను ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం మన్మధుడు బ్లాక్ బస్టర్ అవడమే. కాని మన్మధుడు 2 ట్రైలర్ రిలీజ్ అయ్యాక మెల్ల మెల్లగా కాంట్రవర్సీలతో పాటు సినిమాపై భిన్న అభిప్రాయాలు మొదలయ్యాయి. ఆ ప్రభావం సినిమా విడుదలయ్యాక బాగా ఎఫెక్ట్ చూపించింది. సాయంత్రానికే యావరేజ్, ఫ్లాప్ టాక్ దిశగా టాక్ స్టార్ట్ అయింది. మొదటి రెండు రోజుల్లోనే కలెక్షన్స్ బాగా డ్రాపయ్యాయి. ఇక మొత్తంగా ఈ సినిమా ఫలితం తేలిపోయింది. చివరికి మిగిలింది బయ్యర్లను ఎలా ఆదుకుంటారు అనేదే. ఈ విషయంలో డీప్ డిస్కర్షన్స్ మొదలయ్యాయట. మన్మధుడు 2 సినిమాకు ఒకరు కాదు నిర్మాత. 

నాగ్, జెమిని కిరణ్, వైకామ్ కలిసి సినిమాను నిర్మించారు. అందువల్లే వీళ్ళ మధ్యలో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయట. ఎలాగైనా కొంతయినా వెనక్కు ఇవ్వాలని నాగ్ సినిమాల మార్కెటింగ్ వ్యవహారాలు చూసే సాయిబాబు పట్టుపడుతున్నారు. కానీ అందుకు జెమిని కిరణ్, వైకామ్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇవ్వకుంటే భవిష్యత్ లో తీసే అన్నపూర్ణ సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని సాయిబాబు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారట. ఇదే కొత్త అలవాటుగా అవుతుందని జెమిని కిరణ్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చాలా సినిమాలకు ఇలా వెనక్కు ఇచ్చిన సందర్భాలు వున్నాయి.

నాగార్జున దాదాపు వెనక్కు ఇవ్వడం అన్నది పక్కా అని, వైకామ్, జెమిని కిరణ్ అంగీకరించడం కోసమే వెయిటింగ్ అని తెలుస్తోంది. నెల్లూరు లాంటి చిన్న ఏరియాలోనే మన్మధుడు 2 సినిమాకు పాతిక లక్షల వరకు లాస్ వచ్చినట్లు సమాచారం. మరి మిగిలిన ఏరియాల పరిస్థితి ఎలా వుంటుంది? వైజాగ్, నైజాం, కృష్ణ లలో సొంతంగా విడుదల చేశారు కాబట్టి ఓకె. కానీ మిగిలిన ఏరియాలకే ఖచ్చితంగా ఎంతోకొంత సర్దుబాటు చేయాల్సివుందని స్పష్టమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: