30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కొద్దిరోజులుగా ఇటు ఏపీ రాజకీయాల్లోనూ... అటు సినిమా ఇండస్ట్రీలోని పెద్ద హాట్ టాపిక్ గా మారి పోయారు. ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చిన పృథ్వికి జగన్ గెలిచిన వెంటనే ప్రతిష్టాత్మకమైన టి.టి.డి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవిలో నియమించారు. ఈ పదవి చేపట్టిన వెంటనే పృథ్వి ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి  గెలవడం ఇష్టంలేదని... అందుకే వాళ్ళు జగన్ కు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పటం లేదని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా భవిష్యత్తులో ఎవరు కూడా సినిమా వాళ్ళకు ఓట్లు ఉందని సూచించాడు. 


ఇదిలా ఉంటే వచ్చే ఆదివారం తెలంగాణ మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 30 ఇయర్స్ పృథ్వీ ప్యానెల్ - పి.నాగేంద్ర శర్మ ప్యానెల్స్ మధ్య పోటీ నెలకొంది. ఇరు ప్యానెల్స్ నుంచి విధివిధానాలు హామీలు ఆకర్షిస్తున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇరువురి హామీల్లో ఒక హామీ మాత్రం ఆర్టిస్టుల్ని ప్రధానంగా ఆకర్షిస్తోంది. అదే దళారీ (కోఆర్డినేటర్) వ్యవస్థను అంతం చేయడం. ఈ విషయంలో పృథ్వీ -నాగేంద్ర శర్మ ఇప్పటికే ఆర్టిస్టులకు హామీలిచ్చారు.


ఎన్నికల ప్రచారంలో పృథ్వి మాట్లాడుతూ తాను కళామతల్లి దయతో ఎంతో ఉన్నత స్థితికి ఎదిగానని... తనకున్న పరిచయాలను ఉపయోగించి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వద్దకు వెళ్లి టిఎంటియేయు సభ్యులకు ఆరోగ్యపరమైన ఈ విషయంలో ఆదుకోవాలని కోరతానని... తనకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ నుంచి కేసీఆర్ ప్రభుత్వం అండదండలతో వారి సాయాన్ని కోర‌తాన‌ని హామీ ఇచ్చారు.


అయితే కొంద‌రు పృథ్విపై క‌క్ష క‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. రోజంతా కష్టపడి దళారీ (కోఆర్డినేటర్ల)లకు ఆర్టిస్టులు పర్సంటేజీలు సమర్పించుకోవాల్సి వస్తోంది. దానిని పూర్తిగా రద్దు చేసేదాకా నిద్ర‌పోన‌ని పృథ్వి చెప్పారు. ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న వారిలో పృథ్వి ఈ నినాదం బాగా ఎత్తుకోగా... మిగిలిన వారు సైతం ఇదే నినాదాన్ని తీసుకున్నారు. 


అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా దళారీ వ్యవస్థను టార్గెట్ చేయడంతో ప్రస్తుతం ఈ రంగంలో పాతుకు పోయి ఉన్న దళారులు కం కోఆర్డినేటర్లలో గుబులు మొదలైందట. దీంతో పృథ్వీతో పాటు న‌టుడు శ‌ర్మ త‌దిత‌రుల‌పై వీళ్లంతా గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: