విజయ్ దేవరకొండకు కెరీర్ టర్నింగ్ ఇచ్చిన సినిమా పెళ్లిచూపులు. ఆ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరక్టర్ తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు సినిమా హీరో డైరెక్టర్ కి డైరెక్టర్ హీరోకి లైఫ్ ఇచ్చుకున్నారనుకోవడం కంటే ఈ సినిమా వీళ్ళిద్దరికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ డైరెక్టర్ ని కంటిన్యూ ప్రాజెక్ట్స్ కి అగ్రిమెంట్ చేయించుంకుందంటేనే అర్థమవుతుంది ఆ డైరెక్టర్ స్టామినా ఏంటో. ఇక ఈ డైరెక్టర్ ఆ మధ్య ఫలక్ నుమా దాస్ సినిమాతో యాక్టర్ గా కూడా మారారు. ఇప్పుడు ఏకంగా హీరోగా మారుతున్నారు.

తనను హీరోగా నిలబెట్టి మంచి హిట్టిచ్చిన తరుణ్ భాస్కర్ ను హీరోను చేసే బాధ్యతను విజయ్ దేవరకొండ తీసుకున్నారు. విజయ్ ఫాదర్ నిర్మాతగా ఓ సినిమాను చాలా సైలెంట్ గా ఫినిష్ చేసేశారు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పూర్తయింది. త్వరలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ఒక కొత్త పద్దతిలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టబోతున్నారని తాజా సమాచారం.
 
ఒకవేళ ఈ సినిమా గనక క్లిక్ అయితే ఇక విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ పై ఆయన ఫాదర్ నిర్మాతగా సినిమాల నిర్మాణం కొనసాగించే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే విజయ్ సమీప బంధువు యాష్ రంగినేని కూడా నిర్మాణ రంగంలో వున్నారు. రీసెంట్‌గా విజయ్-రష్మిక జంటగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాకు యాష్ రంగినేని కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఈ బ్యానర్ పై తీసే సినిమాలు సక్సస్ అయితే మాత్రం విజయ్ సోదరులిద్దరు బయట నిర్మాతల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.విజయ్ చేతిలో ఇప్పటికే రెండు సినిమాలుండగా రీసెంట్‌గా పూరి డైరెక్షన్ లో మరో కొత్త సినిమా ఒకే అయింది. ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: