టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వయసు మీద పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎంతో యంగ్ గా కనపడే నాగార్జునకు యూత్ లో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలు కూడా నాగ్ అంటే పడి చస్తూ ఉంటారు. అంతేకాక నాగార్జున సినిమా రిలీజ్ రోజున మనకు ఎక్కువశాతం అమ్మాయిలు సైతం విపరీతంగా వస్తుండడం చూస్తుంటాం. ఇకపోతే అంతటి మంచి ఇమేజి ఉన్న నాగార్జున, ఇటీవల రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటించిన మన్మధుడు2 సినిమాతో ప్రేక్షకుల నుండి కొంత నెగటివిటీని ఫేస్ చేయవలసి వచ్చింది. నిజానికి ఆ సినిమాకు పెద్దగా నెగటివ్ టాక్ రానప్పటికీ, 

సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాల వలన పూర్తి సినిమాకు చాలావరకు డ్యామేజీ జరిగిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. దాదాపుగా రూ.13 కొట్ల వరకు నష్టాలను మన్మధుడు2 సినిమా మిగిల్చడంతో, ఇకపై తాను చేయబోయే సినిమాల విషయమై నాగ్, మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా ప్రారంభం కానున్న బంగార్రాజు సినిమా కథ మరియు కథనాల పై కూడా నాగ్ ఎంతో శ్రద్ధ తీసుకోనున్నారట. నిజానికి ఆ సినిమా కథ చాలా రోజుల క్రితమే విని పూర్తిగా సంతృప్తి చెందిన నాగార్జున, ప్రస్తుతం మన్మధుడు2 ఫ్లాప్ తరువాత ఆ సినిమాలోని సీన్స్ లో ఏమైనా లోపాలుంటే ఇప్పటినుండే సరిచేసేలా జాగ్రత్త వహిస్తున్నారట. 

అంతేకాక ఆ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు కూడా సినిమాలోని సీన్స్ విషయమై ఒకటికి రెండు సార్లు సరిచేసుకుని తీయాలని చెప్పారట నాగార్జున. కేవలం ఒకే ఒక్క సినిమాతో చాలావరకు తన ఇమేజిని, సక్సెస్ ని డ్యామేజీ చేసుకున్న నాగార్జున, రాబోయే బంగార్రాజు సినిమాతో ఎలాగైనా అద్భుతమైన హిట్ కొట్టి, మరొక్కసారి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు, ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలను బట్టి అర్ధం అవుతోంది. మరి ఆ సినిమా నాగ్ కు ఎంత మేర విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే, మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: