టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించిన సూపర్ స్టార్ కు లేడీస్ లో మరింత ఎక్కువగా ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. స్వతహాగా ఎంతో అందగాడైన మహేష్ కు, సినిమా హీరోయిన్స్ లో సైతం విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ప్రక్కన ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు, తమ జన్మ తరించినట్లే అంటూ, ఆ అద్భుత అవకాశం కోసం ఎదురుచూసే వారిలో రెజీనా కూడా ఒకరు. కొన్నేళ్ల క్రితం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఎస్సెమ్మెస్ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెజీనాకు, మధ్యలో కొన్ని మంచి మంచి హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా ఎదురయ్యాయి. నిజానికి తనకు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, 

అయితే వాటిన్నిటిని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగడమే తనకు అలవాటని తరచూ రెజీనా చెప్తుంటారు. ఇకపోతే ఇటీవల ఆమె, అడివి శేష్ తో కలిసి ఎవరు అనే సస్పెన్స్ మూవీ లో నటించి సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా అద్భుత విజయం సాధించడంతో, ఇటీవల ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన రెజీనా, తనకు సూపర్ స్టార్ మహేష్ అంటే అమితమైన అభిమానమని, నిజానికి మా ఇంట్లో తెలుగు తెలియకపోవడంతో ఎవరూ తెలుగు సినిమాలు చూసేవారు కాదని, అయితే తాను కూడా భాష అర్ధంకాకపోవడం వలన తెలుగుకు సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ కూడా చూసేవారు కాదట. 

అయితే ఆ సమయంలోనే తనకు అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చిందని, అప్పుడు టాలీవుడ్ కు సంబంధించి టాప్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ గురించే తనతో ఎక్కువమంది చెప్పేవారని, ఆయన యాక్టింగ్, స్టైల్, హ్యాండ్సమ్ నెస్ మరెవ్వరికీ రావని అంటోందో రేజీనా. అంతేకాక కొన్ని సీన్స్ లో మహేష్ బాబు నటన చూస్తుంటే అలానే చూడాలని అనిపిస్తూ ఉంటుందని, సూపర్ స్టార్ ని ఆకాశానికి ఎత్తేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు సూపర్ స్టార్ పై ఈ రేంజ్ లో పొగడ్తలు కురిపించడంతో, ఆయన ఫ్యాన్స్ రేజీనాకు ఫ్యూచర్ లో మంచి అవకాశాలు రావాలని, అలానే ఆమెకు మంచి సక్సెస్ లు లభించాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రెజీనాపై పొగడ్తలు కురిపిస్తన్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: