యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన సినిమా సాహో. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్, తొలిసారి టాలీవుడ్ కి పరిచయం అవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ అద్భుతమైన వ్యూస్ సాధించి, సినిమాపై అంచనాలు మరింతగా పెంచాయి. ఇకపోతే ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నేడు జరిగినట్లు, అలానే సినిమాకు యు/ ఏ సర్టిఫికెట్ లభించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అలానే ఈ సినిమా మొత్తం 2గం.54ని.లు సాగుతుందని, అయితే సినిమాను వీక్షించిన సెన్సార్ అధికారులు, 

సినిమాలోని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలకు మంత్రముగ్ధులయ్యాని అంటున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య కూడా ఉందని అంటున్నారు. అదేమిటంటే, ఈ సినిమా నిడివి పరంగా దాదాపుగా మూడు గంటలు సాగుతుందని, ఇక ఇటీవల ఇంత ఎక్కువ సమయం నిడివిగల సినిమాల్లో, చాలా కొద్ది సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగలిగాయనేది వారు చెప్తున్న వాదన. నిజానికి సాహోను దర్శకుడు సుజీత్, మూడు గంటలకు పైగానే తీసాడని, అయితే అప్పటికే సినిమాలో కొన్ని అనవసర సన్నివేశాలు తొలగించగా, చివరకు ఈ 2గం. 54ని. నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. 

అయితే సాహోకు సెన్సార్ జరిగిందని మరియు నిడివి ఎక్కువయిందనే విషయాలపై, ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల్లో, ఇప్పటివరకు సాహో సినిమా యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని, కావున ఈ విషయాలపై ఆ సినిమా టీమ్ స్పందించేవరకు నమ్మలేమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సాహో లెంగ్త్ ఎక్కువ అయింది అంటూ ఇప్పటికే పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రసారం కావడంతో, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా సినిమా ఫలితం పై కొంత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా, ఈ విషయాలపై సాహో టీమ్ స్పందిస్తేనే కానీ అసలు నిజాలు వెలుగులోకి రావు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: