అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ సూపర్ స్టార్.. అంతేనా.. ఆలిండియాలో ఆయనో లెజండరీ యాక్టర్.. ఒకప్పుడు బాలీవుడ్ ను షేక్ చేయడమే కాదు.. కాలంతో పాటు మారడమూ ఆయన్ను చూసి నేర్చుకోవాలి.. 1990ల్లోనే సినిమాల నుంచి విరమించుకోవాలనుకున్న ఈ బిగ్ బచ్చన్.. ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారు.


కాలంతో పాటు మారుతూ.. తనను తాను మార్చుకుంటూ.. వయస్సుకు తగ్గపాత్రలు చేస్తూ అసలైన నటుడిగా గౌరవం పొందుతున్నారు. 76 ఏళ్ల వయస్సులోనూ ప్రధాన పాత్రలు పోషిస్తూ యూత్ కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ను ఆయనే బయటపెట్టారు. అదేంటంటే.. అమితాబ్ కాలేయం 75 శాతం వరకూ పాడైపోయిందట. ఆయన ఇప్పుడు కేవలం మిగిలిన పాతిక శాతం కాలేయంతోనే జీవిస్తున్నారట.


స్వస్థ్‌ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యం గురించి ఈ సంచలన విషయం బయటపెట్టారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, సులభంగా నివారించుకోవచ్చనే విషయాన్ని ప్రజలకు చెప్పడం కోసం ఈ విషయాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ బయటపెట్టారట. అందుకే తరచూ తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని అమితాబ్ చెబుతున్నారు.


ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘ఒకప్పుడు నాకు క్షయ, హైపటైటిస్‌ బి వ్యాధులు ఉండేవి. దాదాపు ఎనిమిదేళ్లు వీటిని నేను గుర్తించలేకపోయాను. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. చెడు రక్తం వల్ల అప్పటికే నా కాలేయం 75 శాతం చెడిపోయింది. ఇప్పుడు నేను కేవలం 25 శాతం కాలేయంతో జీవిస్తున్నా. క్షయ వ్యాధికి నివారణ ఉంది.. కానీ గుర్తించకపోవడం వల్ల నేను నష్టపోయా.. అని వివరించారు అమితాబ్ బచ్చన్.


ఇదంతా తాను పబ్లిసిటీ కోసం చెప్పుకోవడం లేదని అమితాబ్ అంటున్నారు. తనలాగా మరొకరు బాధపడకూడదని ఈ విషయాన్ని ప్రజలకు చెబుతున్నానని వివరణ ఇచ్చారు. మీరు పరీక్షలు చేయించుకోలేకపోతే.. వ్యాధిని గుర్తించలేరు, ఎప్పటికీ నివారించుకోలేరు’.. అంటూ అమితాబ్ బచ్చన్ హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: