కొణిదెల.. ఇది ఒక ఊరి పేరు .. కానీ ఇదో వంశం పేరు కూడా. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. కొణిదెల శివశంకర వర ప్రసాద్.. అనే వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాశాడు.. ఆయనే చిరంజీవి. ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ అన్నయ్య స్థాయికి ఎదిగాడు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అటు నటనలో రాణిస్తూనే నిర్మాతగానూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేస్తున్నారు.


చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ .. కొణిదెల వంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.. ఆయన ఏమన్నారంటే.. క‌ర్నూలు - రేనాడు క‌థ‌తో తెర‌కెక్కిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమాకి గొంతు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. కొణిదెల ప్రొడ‌క్షన్స్ ఈ సినిమాని యాథృచ్ఛికంగా తీయ‌లేదు. క‌ర్నూలు- నందికొట్కూరు కొణిదెల గ్రామం అని సినిమా చేసేప్పుడు తెలిసింది. ఇది తెచ్చుకుంది కాదు.. వెతుక్కుంటూ వ‌చ్చిన సినిమా ఇది. అన్నయ్యను టైటిల్ పాత్రధారిని చేసింది. ఎవ‌రినో నిర్మాత‌లుగా పెట్టుకోలేదు. కొణిదెల ఇంటి పేరు పెట్టుకున్న రామ్ చ‌ర‌ణ్ నిర్మాత అయ్యారు.


ఒక త‌మ్ముడిగా నేను ఇలాంటి సినిమా చేయ‌లేక‌పోయాను. ఇలాంటి గొప్ప సినిమా తీసే స‌మ‌ర్థత నాకు లేక‌పోయింది. నా త‌మ్ముడి లాంటి రామ్ చ‌ర‌ణ్ .. 150వ సినిమా చేశాడు. ఇలాంటి సినిమా చేస్తే చిరంజీవి గారే చేయాలి అనేంత‌గా సైరా చిత్రాన్ని ఇప్పుడు తీస్తున్నారు.మ‌న దేశ చ‌రిత్రను ఎవ‌రో రాస్తే దాని గురించి మాట్లాడ‌తాం. భార‌త‌దేశం మ‌ర్చిపోయినా మ‌న తెలుగు వాళ్లం మ‌ర్చిపోలేదు. మ‌న కొణిదెల వంశం మ‌ర్చిపోలేదు. దేశం కోసం ఎంతో మంది చ‌నిపోయారు. దేశం గుర్తించ‌ని ఉయ్యాల‌వాడ చ‌రిత్రను కొణిదెల సంస్థ గుర్తించింది. ఇది గ‌ర్వకార‌ణం. కొణిదెల నామ‌ధేయాన్ని సార్థకం చేసుకున్నారు... అంటూ కొణిదెల వంశం గురించి గొప్పగా మాట్లాడారు పవన్ కల్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: