హైదరాబాద్ లో జరిగిన మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. సైరా సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఇందులో న‌టించ‌లేక‌పోయాను. కానీ గొంతు వినిపించాను. `సైరా-న‌ర‌సింహారెడ్డి` అని అన‌గ‌లిగానంటే నా గుండె లోతుల్లోంచి అభిమాని గా వ‌చ్చింది అన్నారు. అలాగే.. చిరంజీవి గురించి నేరుగా ప్రస్తావిస్తూ.. అన్నా నువ్వు కొట్టగ‌ల‌వు. అన్నా నీకు బానిస‌లం.. మేం.. అంటూ ఉద్వేగభరితులయ్యారు.


చిరంజీవితో అనుబంధం గురించి, సైరా సినిమా గురించి పవన్ గొప్పగా మాట్లాడారు.. ఆయన ఏమన్నారంటే.. నేను మీలో ఒక‌డిగా వ‌చ్చాను ఇక్కడికి. నాకు జీవితంలో స్ఫూర్తి ప్రధాత అన్నయ్య చిరంజీవి గారికి మ‌న‌స్ఫూర్తిగా జ‌న్మదిన శుభాకాంక్షలు. ఇది చాలా ప్రత్యేక‌మైన సంవ‌త్సరం. ప్రత్యేక‌మైన సందర్భమిది. అన్నయ్య అభిమానిగా అన్నయ్యను ఎలా చూడాల‌ని ఉవ్విళ్లూరానో అలాంటి సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి.


దేశం కోసం మ‌న నేల కోసం ఎంతో త్యాగం చేసిన స‌మ‌ర‌యోధుడి జీవితాన్ని సినిమాగా తీయ‌డం.. విభిన్నమైన క‌ళాకారులు వేరే భాష‌ల నుంచి వ‌చ్చిన వారు ఇందులో న‌టించారు. నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు. ఒక‌రు అన్నయ్య అయితే.. ఇంకొక‌రు అమితాబ్ బ‌చ్చన్. వీళ్లిద్దరూ నాకు జీవితంలో బ‌ల‌మైన స్ఫూర్తిప్రదాత‌లు. అన్నయ్యను చూడ‌టానికి వెళ్లిన‌ప్పుడు అమితాబ్ గారిని క‌లిసే అరుదైన అవ‌కాశం ఈ సినిమా షూటింగ్ లో ల‌భించింది.


ఇలాంటి చిత్రం రామ్ చ‌ర‌ణే చేయాలి. ఎన్ని కోట్లు అయినా .. డ‌బ్బు వ‌స్తుందా లేదా? అన్నది చూడ‌కుండా బ‌ల‌మైన సినిమా తీయాల‌ని అనుకున్నాను. ద‌ర్శకులు సురేంద‌ర్ రెడ్డిగారి క‌ల ఇది. ఆయన క‌ల‌ను సాకారం చేసుకున్నారు. ఆయ‌న గ‌తంలో చేసిన సినిమాల‌న్నీ నాకు న‌చ్చిన‌వి. అలాంటి వ్యక్తి ద‌ర్శక‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా మ‌నంద‌రి అభిమాన స్టార్ చిరంజీవి గారు న‌టించిన చ‌క్కని చిత్రమిది. ఈ చిత్రానికి ద‌ర్శక‌నిర్మాత‌లు.. ర‌చ‌యిత‌లు .. నా త‌ల్లి వంటి వ‌దిన గారికి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ .. ప్రత్యేకంగా అమితాబ్ బ‌చ్చన్ గారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్యవాదాలు తెలుపుకుంటున్నాను`` అని అన్నారు పవన్ కల్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: