Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 11:25 am IST

Menu &Sections

Search

విశాల్ పేరు తో దర్శకుడి మోసం!

విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా సినీ పరిశ్రమలో మంచి పేరు ఉన్న నటుడి పేరు చెప్పుకొని ఎన్నో మోసాలకు పాల్పపడుతుంటారు కొంతమంది దళారు. సినీ పరిశ్రమలో తమకు పెద్ద దర్శకులు, నిర్మాతలు, హీరోలు పరిచయం ఉన్నారని, వారితో సంప్రదించి మీకు చిన్న ఛాన్సు ఇప్పిస్తామని ఎంతో మంది ఔత్సాహికులను మోసం చేస్తూ డబ్బులు గుంజుతుంటారు.  ఇక అమ్మాయిల విషయం అయితే మరీ దారుణం.  సినిమాల్లో నటించాలని ఎంతో ఆశతో వచ్చే యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా అనుభవించడమే కాదు వేశ్యా గృహాలకు అమ్మిన సంఘటనలు కూడా ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. 

ఆ అవమానం భరించలేక ఎంతో మంది యువతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.  ఆ మద్య శ్రీరెడ్డి ఇదే అంశంపై టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చింది. ఇక బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం కూడా మొదలైంది.  అయితే ఓ స్టార్ హీరో పేరు చెప్పుకొని దర్శకుడు ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..తమిళ స్టార్ హీరో విశాల్ కి తాను మంచి పరిచయం అని, త్వరలో తాము ఓ మూవీ తీయబోతున్నామని దర్శకుడు వడివుడైయాన్‌, తనను మోసం చేశారని నరేశ్ బోద్రా అనే వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. 

సినిమా తీయాలన్న కోరికతో ఉన్న బోద్రాను కలిసిన వడివుడైయాన్‌, తన వద్ద విశాల్‌ కాల్‌ షీట్స్‌ ఉన్నాయని చెప్పి, అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపించాడు.  అయితే విశాల్ లాంటి హీరోతో సినిమా అనగానే బోద్రా సంబరపడిపోయాడు..వెంటనే వడివుడైయాన్‌ కి రూ.47 లక్షలు ఇచ్చాడు. ఆ సమయంలో విశాల్ తో చేసుకున్న ఒప్పంద పత్రాలు చూపించడంతో బోద్రా బోల్తా పడ్డారు. 

డబ్బులిచ్చినా కూడా ఎంతకు సినిమా ప్రస్తావన తీసుకు రాకపోవడంతో ఆ పత్రాలు మరోసారి పరీక్షించగా అవి నకిలీవని తేలడంతో తాను దారుణంగా మోసపోయానని భావించిన బోద్రా తన డబ్బు వెనక్కి ఇవ్వాలని చెప్పాడు. కానీ, వడివుడైయాన్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నారట. దాంతో తనకు డబ్బులు  ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేశ్ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వడివుడైయాన్‌ ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, నరేశ్‌బోద్రా ఎవరో తనకు తెలియదని వడివుడైయాన్ అంటుండటం గమనార్హం.


hero vishal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!