అల్లు అర్జున్ లో తపన ఉన్న నటుడు ఉన్నాడు. ఆయన చేసిన సినిమాలు వరసగా చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ప్రతి సినిమాకు ఓ కొత్తదనం తీసుకురావడానికి బన్నీ విపరీతంగా శ్రమిస్తాడని కూడా అంటారు. ఆయన ఒక  మంచి కధ కోసమే ఏడాది పాటు వెయిట్ చేశాడంటేనే ఆయన ఆరాటం, సినిమా మీద పాషన్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇపుడు బన్నీ అభిమానులకు మరో స్వీట్  సర్ప్రైజ్ ఇస్తున్నాడు.


ఇపుడు సెట్స్ మీద ఉన్న బన్నీ న్యూ మూవీ అల వైకుంఠపురంలోలో బన్నీ డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నాడుట. ఈ న్యూస్ ఫ్యాన్స్ కి ఎంతో హ్యాపీ అన్నది వేరేగా చెప్పనవసరం లేదు. బన్నీ ఈ మూవీలో స్టలిష్ బాయ్ గా అలాగే పచ్చి పల్లెటూరి మాస్ కుర్రోడిగా కనిపించబోతున్నాడుట. ఒక పాత్ర ఏమో సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మరో పాత్ర పల్లెటూరిలో తిరిగే అల్లరి యువకుడుగా డైరెక్టర్ త్రివిక్రం డిజైన్ చేశారట.



సాఫ్ట్ వేర్ గయ్ కి జోడీగా పూజా హెగ్డే కనిపిస్తుందట. మరి పల్లెటూరి అబ్బాయి పక్కన ఎవరో మాత్రం చెప్పలేదు. మొత్తానికి బన్నీ రెండు పాత్రలు చేయడం అంటే ఓ రికార్డే. అసలు ఈ రోజుల్లో హీరోలు డ్యుయల్ రోల్ చేయడమే మానేశారు. సీనియర్ హీరోల తరువాత మళ్ళీ ఆ క్రెడిట్ మాత్రం బన్నీకే అని చెప్పాలి. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ప్రస్తుతం పూర్తి చేసుకోబోతోందిట.



ఈ మూవీని కంప్లీట్ చేసి 2020 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రం టైటిల్ దగ్గర నుంచే తన టేస్ట్ ని చెప్పకనే చెబుతున్న అల వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందన్న ఆశ బన్నీ  ఫ్యాన్స్ లో ఉంది. సంక్రాంతికి మరో హీరో మహేష్ బాబు తో బన్నీ తలపడబోతున్నాడు. మరి సంక్రాంతి బరిలో సూపర్ హిట్ కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ బన్నీ పల్లెటూరి కుర్రాడి పాత్రలో బాగా దట్టించారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: