నాగార్జున కెరియర్ లో ‘మన్మధుడు 2’ ఒక మచ్చలా మారడమే కాకుండా నాగ్ ఇమేజ్ కి ఈ మూవీ ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టింది. 60 సంవత్సరాల వయసులో నాగ్ రొమాంటిక్ నటనను ప్రేక్షకులు ఏమాత్రం ఇష్టపడక పోవడంతో ఈ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఈ మూవీ విడుదలైన రెండవరోజు నుండి ధియేటర్లు ఖాళీ అవ్వడంతో ఈ మూవీని ఇప్పటికే చాల చోట్ల తీసివేసారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ బయ్యర్లు దాదాపు 60 శాతం పైగా నష్టపోయిన పరిస్థితులలో ఈ బాధ్యత ఇప్పుడు నాగార్జునను చుట్టుముట్టింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని నాగార్జున ఒక్కడే నిర్మించలేదు. జెమినీ కిరణ్ తో పాటు మరికొందరు సహ నిర్మాతలుగా ఈ మూవీకి వ్యవహరించారు. 

అయితే ఈ మూవీ మార్కెట్ అంతా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై జరగడంతో ఈ మూవీ ప్రధాన నిర్మాత నాగార్జున మాత్రమే అన్న అభిప్రాయంలో బయ్యర్లు ఉన్నారు. దీనితో నష్టపోయిన బయ్యర్లు అంతా నాగార్జున కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతున్నట్లు టాక్. 


ఈ వివాదం మరింత ముదిరి తన పరపతి దెబ్బ తినకుండా నాగ్ రంగంలోకి దిగి ఈ మూవీ బయ్యర్లకు కొంతమేరకు నష్ట పరిహారం చేస్తాను అంటూ వారందరికీ మెసేజ్ లు పంపుతున్నట్లు టాక్. దీనితో ‘మనదుడు 2’ నాగ్ కు ఇమేజ్ పరంగా కాకుండా ఆర్ధికంగా నష్టాలు కలిగించిన సినిమాగా మారింది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈ మూవీ ఇచ్చిన ఫలితంతో నాగార్జున త్వరలో మొదలు పెట్టాలి అనుకున్న ‘బంగార్రాజు’ మూవీ ఆలోచనలు అటకెక్కాయి అంటే ‘మన్మధుడు 2’ నాగ్ ను ఎంతగా కలవర పెట్టిందో అర్ధం అవుతుంది. దీనితో భవిష్యత్ లో నాగ్ ఎంపిక చేసుకునే కథల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: