నేటి యువతకు ఎంతో చేరువైన ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్ సేవలకు బుధవారం రాత్రి కొద్ది సేపు అంతరాయం ఏర్పడింది. రాత్రి 8గంటల సమయంలో భారత్‌, జపాన్‌ సహా పలు దేశాల్లో ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ట్విట్టర్ వినియోగదారులకు సేవలు అందలేదు. ట్టిట్టర్ సైట్‌, యాప్‌ ఓపెన్‌ అయినా కూడా ట్వీట్‌ చేయలేకపోయారు. ఇందు కోసం ప్రయత్నించిన వారికి "some thing went wrong" అనే ఎర్రర్‌ మెసేజ్‌ చూపించింది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఉన్న ట్విటర్‌ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొని ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత సేవలు ప్రారంభమయ్యాయి. సమస్యపై ట్విటర్‌ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు.

 


సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత ఎటువంటి వార్త అయినా సెకన్లు, నిమిషాల్లో ప్రజలకు చేరువైపోతోంది. ఇందుకు అనేక ప్లాట్ ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు రాత్రి టీవీలో వార్తలు, ఉదయం వచ్చే పేపర్, మరీ అవసరమైతే టెలిగ్రామ్ లు, పోస్టల్ సేవలు, టెలిఫోన్ సేవలు ఉండేవి. వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు టెక్నీలజీ అందుబాటులోకి వచ్చేసింది. అరచేతిలో వార్తలు అర నిమిషంలో ఉంటున్నాయి. అటువంటి వ్యవస్థలో ట్టిట్టర్ ఒకటి. ప్రజలకెంతో చేరువైన ఈ సైట్ వినియోగించేవారు కోట్లలో ఉన్నారు. చిన్న అంతరాయం వచ్చినా ఎంతో సమాచారం ఆగినట్టే.

 


ట్విట్టర్ సేవలు యువతకు ఎంతో చేరువయ్యాయి. సినిమా వార్తలు, వారికి సంబంధించిన అప్డేట్ న్యూస్, మూవీ ప్రమోషన్స్ అన్నీ ఇప్పుడు ట్విట్టర్ లోనే ఎక్కువగా అప్డేట్ చేస్తున్నారు. ఫ్యాన్ వార్ కూడా ఇందులో ఎక్కువే. వ్యాపాద దిగ్గజాలు, సామాన్య కార్యకర్త నుంచి దేశ మొదటి పౌరుడు వరకూ ఈ ట్విట్టర్ ప్లాట్ ఫాంనే ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ కు కూడా ట్విట్టర్ సేవలు ఉపయోగపడుతున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: