తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మారు మోగుతుంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాన్ తనదైన మేనరీజంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఒకదశలో చిరంజీవి రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం ఆయన నటుడిగానే కాకుండా అన్న బాటలో నడుస్తూ రాజకీయాల్లోకి వెళ్లి జనసేన పార్టీ స్థాపించారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేయగా ఒక్క ఎమ్మెల్యే గెలిచారు.  పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాన్ రెండు చోట్ల ఓడిపోయారు. 

అయితే తాము ఎందుకు ఓడిపోయామో అన్న విషయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలో సమీక్షలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాన్. నేడు మెగాస్టార్ పుట్టిన రోజు..ఈ సందర్భంగా మెగా అభిమానుల సమక్షంలో నిన్న రాత్రి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి . ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..తన జీవితంలో అన్నయ్యే స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఆయన వేసిన బాటలోనే మేమందరం నడుస్తున్నామన్నారు. 

ఇటీవల తెలంగాణలో ఇంటర్ మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు తన హృదయాన్ని కలచి వేశాయన్నారు. అలాంటి ఆవేదన తాను కూడా అనుభవించానని..ఇంటర్ మీడియట్ లో  తాను ఫెయిల్ అయినపుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, అన్నయ్య దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉంది దాంతో కాల్చుకోవాలనుకున్నా దాంతో ఇంట్లో వాళ్ళు భయపడి అన్నయ్య ముందుకు తీసుకెళ్లారు.  అప్పుడు అన్నయ్య చెప్పిన ధైర్యం నాకు ఇప్పటికే వెన్ను తట్టి లేపుతుంది. 

ఆ సమయంలో అన్నయ్య నన్ను దగ్గరకు తీసుకొని నేను బతికే ఉన్నాను..నీకేంటి భయం అన్నాడు..అంతే ఆ ఒక్కమాట నా గుండెల్ని కదిల్చాయి, కొండంత బలం మా అన్నయ్య ఉన్నపుడు నేనెందుకు చావాలన్ని అప్పుడే నిర్ణయించుకున్నాను.  అందుకే మా అన్నయ్య చిరంజీవి నాకు స్ఫూర్తిప్రదాత.  తనకు అన్నయ్య చిరు అంటే చాలా ఇష్టమని , అయితే అన్నయ్య తో సైరా నరసింహారెడ్డి సినిమాని నిర్మిస్తున్న రాంచరణ్ నాకంటే గొప్పవాడని అన్నయ్య చిరు , అబ్బాయ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: