Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 4:58 pm IST

Menu &Sections

Search

సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?

సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నర్తనశాల’లో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. ‘పెళ్లిచేసి చూడు’లో ధూపాటి వియ్యన్న, ‘చదరంగం’లో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి, ‘తోడికోడళ్లు’లో మతిమరుపు లాయరు కుటుంబరావు, ‘కత్తుల రత్తయ్య’లో రౌడీ, ‘అనార్కలి’లో అక్బర్, ‘పాండవ వనవాసం’లో దుర్యోధనుడు మొదలైన పాత్రలు తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయాయి. భావస్ఫోరకమైన విరుపు, అందమైన, అర్థవంతమైన ఉచ్చారణ, అందుకు తగ్గ ఆంగికాభినయాలు ఆయన స్వంతం.
 
ఎస్‌.వి. రంగారావు పౌరాణిక పాత్ర‌ల్లో మేటి. ధారాప్ర‌వాహంగా డైలాగ్ చెప్ప‌డంలోను, డైలాగ్ విరుపుల‌ను దిట్ట‌. ఒక‌సారి రావ‌ణాసురుడు పాత్ర న‌టిస్తూ, షాట్ గ్యాప్‌లో ఫ్లోర్ బ‌య‌ట కూర్చుని రిలాక్స్‌డ్‌గా సిగ‌రెట్ తాగుతున్నారు. షూటింగ్ చూడ్డానికి వ‌చ్చిన వాళ్ళ‌లో ఒక బామ్మ ముందుకొచ్చి ఏమ‌య్యా రంగారావూ!రావ‌ణుడు గొప్ప వేద పండితుడు. ఆయ‌న సిగ‌రెట్ తాగ‌డం మేమెక్క‌డా చ‌ద‌వ‌లేదు, విన‌లేదు. ఈ వేషంలో సిగ‌రెట్ తాగడం అంత అవ‌స‌ర‌మా? చ‌క్క‌గా రామా, కృష్ణా అంటూ కూర్చో అంటూ వెళ్ళిపోయింది. రావ‌ణాసురుడు షాక్ తిని, సిగ‌రెట్‌పారేసి సెట్‌లోకి వెళ్లిపోయాడు. 


బాపుగారి సంపూర్ణ రామాయ‌ణం సినిమాలో ఎస్‌.వి.రంగారావు రావ‌ణాసురుడుగా, చంద్ర‌క‌ళ సీత‌గా న‌టించారు. అశోక‌వ‌నంలో చెట్టుకింద సీత దీనంగా కూచుని వుంది. ఎస్‌.వి.ఆర్‌. ప్రవేశించి సీతా! సుంద‌రీ! య‌వ్వ‌నం సెల‌యేరు లాంటిది వృధా పోనీయ‌కు. న‌న్ను క‌రుణించు అంటాడు.  బదులుగా సీత మూర్ఖుడా!మూర్ఖుడికి మోక్షంలాగే నేను నీకు ల‌భ్యం కాను అనే డైలాగ్ చెప్పాలి. చంద్ర‌క‌ళ మెడ్రాస్ కాన్వెంట్‌లో చ‌ద‌వ‌డం వ‌ల్ల తెలుగు స‌రిగ్గా రాదు. మూర్ఖుడా బ‌దులు మూకుడా అని, త‌ప్పు గ్ర‌హించి, సారీ అంకుల్‌, వెరీ సారీ అంది. ఎస్‌.వి.ఆర్. అందుకుని నెవ్వ‌ర్ మైండ్ సీత క‌మాన్ క్యారీఆన్ అన్నాడు. డైలాగ్ రికార్డు చేసిన సౌండ్ ఇంజ‌నీర్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి, చ‌నువుగా ఎస్‌.వి.ఆర్‌.తో ఏమ‌య్యా నువ్వు తెలుగు రావ‌ణాసురుడివా? ఇంగ్లీష్ రావ‌ణాసురుడిగా? అని అడిగాడు. అందుకు ఎస్వీఆర్ ఎన్ని భాష‌ల‌కైనా ప్ర‌పంచంలో ఒక్క‌డే రావ‌ణాసురుడు. ద‌ట్ ఈజ్ ఎస్‌.వి.ఆర్‌. నేను చెప్పిందే డైలాగ్‌, రికార్డ్ చేసుకో ఫో అన్నాడు. ఈ సంఘ‌ట‌న‌కు ఆ ఫ్లోర్‌లో ఉన్న‌వాళ్ళంతా న‌వ్వారు. పౌరాణిక పాత్ర‌ల‌కు ఆయ‌న పెట్టింది పేరు. అన‌ర్గ‌ళంగా డైలాగ్ చెప్ప‌డంలో, డైలాగ్  త్రో లో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. న‌ర్త‌న‌శాల‌లో కీచుకుని పాత్ర‌కు జ‌కార్తా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఆయ‌న‌కు ఆసియా ఉత్త‌మ స‌హాయ‌న‌టుడిగా అవార్డు వ‌చ్చిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.


s-v-r-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ నూనెతో ఇన్ని లాభాలా...?
"ఊల్లాల ఊల్లాల" అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ
ర‌చ‌యిత‌ల సంఘం సిల్వ‌ర్‌ జూబ్లీలో కృష్ణంరాజు హామీ
రివ్వ్యూలు వెంట‌నే రాయొద్దంటున్న హీరో
ప్రేమ పిపాసి రూల్స్‌ని బ్రేక్ చేస్త‌దా...?
90ఎం.ఎల్‌. `దేవ‌దాస్‌` అజర్ బేజాన్ వెళ్లనున్నాడా...?
సినిమాని ప్ర‌మోట్ చెయ్య‌డం అంద‌రి బాధ్య‌తంటున్న‌ రాక‌స్టార్‌
ఇస్మార్ట్ భామ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాద్షాతో క‌లిసి చిందులేసిందా...?
ఎర్ర‌చీర‌లో శ్రీ‌కాంత్ అఘోరా...?
కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌ లో ఏం దొరుకుద్దో...?
ఇక్కట్ల‌లో ప్రజలు
జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే ఇవి తినాల్సిందే...!
రాత్రిపూట మ‌నం చేసే త‌ప్పులే మ‌న‌కు శాపాలా...?
రెండు రెట్లు ఎక్కువ చూపిస్తానంటున్న మారుతి
కాంబినేషన్ కొత్తగా ఉందంటున్న మ‌హేష్‌
'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?
హాలీవుడ్ స్ధాయికి రౌడీ హీరో క్రేజ్‌.... జోష్‌ మాములుగా లేదుగా...!
క్రేజీ హీరోకి సూప‌ర్‌స్టార్ స‌పోర్ట్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో...?
త‌మ్ముడు స‌క్సెస్ అయితే నేను డ్ర‌స్ మారుస్తా...?
ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న మంజు
వ‌ర్మ `బ్యూటిఫుల్‌` ఘాటు మాములుగాలేదుగా...?
ఉత్తేజ్ స్కూల్‌కి డిమాండ్ బాగానే ఉందే...?
సాయి పల్లవి 'అనుకోని అతిథి'
హీరో వెంక‌టేష్ నాకు ఇన్స్‌పిరేష‌న్‌
డైరెక్ట‌ర్లను అంత మాట అనేశాడేంటి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.