బాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలకు నేర చరిత్ర ఉంది. సంజయ్ దత్ నుండి సల్మాన్ ఖాన్ వరకు చాలామంది ఇది జైలు గోడలు చూసిన వాళ్లే. మన సంజయ్ దత్ లైఫ్ స్టోరీ మీద 'సంజు’ అనే సినిమా కూడా వచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ అయితే ఫుట్ పాత్ మీద ఉన్న వారిని కారు తొక్కించడం, జింకలను వేటాడడం వంటి కేసులలో ఇరుక్కున్నాడు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మన బాలీవుడ్ బాద్షా షారుక్ కి కూడా వచ్చింది. 

అయితే ఒక నిమిషం. ఇంత పెద్ద వార్త ఎక్కడ న్యూస్ లోనూ, పేపర్లలోనూ చూడలేదే అని అనుకుంటున్నారా? అసలు అతనిని అరెస్టు బహిరంగంగా జరిగితే కదా. సీక్రెట్ గా ఒక రూమ్ లో విచారిస్తున్నారు. ఆ విచారణ జరిపేందుకు కూడా మనందరికీ తెలిసిన ఇమ్రాన్ హష్మీ. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది. అదే..! ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలతో మనందరినీ ఊపేసి ఆడవారి మనసు దోచుకున్న రొమాంటిక్ కింగ్ షారుక్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ లను చేస్తున్నాడు. 

ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ 'నెట్ ఫ్లిక్స్' గత కొద్ది రోజులుగా షారుక్ ఖాన్ ఉన్న ప్రోమో లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజే ఆ వెబ్ సిరీస్ పేరు మరియు దానికి సంబంధించిన చిన్న క్లిప్ను వదిలారు. ఇన్నిరోజులు షారుక్ ఖాన్ ని ఇంటరాగేట్ అని అందరూ అనుకుంటుండగా ఆ వీడియో కూడా అలాగే మొదలైంది. అయితే నిందితుడు స్థానంలో ఉన్న ఇమ్రాన్ హష్మీ ఒక్కసారిగా
ఇంటరాగేట్ గా మారి షారుక్ చేతికి సంకెళ్ళు వేశాడు. వెళ్తూ వెళ్తూ అతని పేరు 'బార్డ్ ఆఫ్ బ్లడ్' అని చెప్పి మరీ వెళ్ళాడు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రచారం అవుతుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమో తో ఈ సీరీస్ పైన అందరి అంచనాలు తారాస్థాయికి చేరాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: