‘సైరా’ టీజర్ పై అల్లు అర్జున్ స్పందించలేదు అన్న మెగా అభిమానుల అసహనానికి బన్నీ చాల వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చాడు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మామయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తన ట్విటర్ ద్వారా తెలియచేస్తూ ఆ ట్విట్ కు ‘సైరా’ టీజర్ ను లింక్ చేసాడు. 

అయితే ‘సైరా’ టీజర్ గురించి ఒక్క కామెంట్ కూడ బన్నీ తన ట్విట్ లో చేయలేదు. దీనితో బన్నీ ‘సైరా’ టీమ్ పై అసంతృప్తిగా ఉన్నాడా అంటూ కొత్త కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ ‘సైరా’ మూవీలో తనకు ఒక పాత్రను ఇమ్మని దర్శకుడు సురేంద్ర రెడ్డిని అడిగినట్లు టాక్. 

దీనితో సురేంద్ర రెడ్డి అల్లు అర్జున్ కోసం విజయ్ సేతు పతిని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసిన పాత్రను బన్నీకి ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్ర విషయంలో బన్నీ ఆలోచించి తన నిర్ణయం చెప్పేలోపు ఈ మూవీ తమిళంలో కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ఒక తమిళ నటుడు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలతో బన్నీ నిర్ణయం రాకుండానే విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

దీనితో ఈ పరిణామాలు అల్లు అర్జున్ కు ఊహించని షాక్ ఇవ్వడంతో ‘సైరా టీమ్ పై బన్నీ కొంత అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సురేంద్ర రెడ్డి మెగా ఫ్యామిలీకి ముందుగా పరిచయం అయింది బన్నీతో ‘రేసుగుర్రం’ సినిమా తీస్తున్న సమయంలోనే అన్న ప్రచారం ఉంది. దీనితో తాను ‘సైరా’ లో ఒక పాత్ర కోసం తాను అడిగినా తనను ‘సైరా’ టీమ్ పట్టించుకోలేదు అన్న అసహనం బన్నీకి ఉన్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి. అయితే ప్రచారంలో ఈ వార్తలు కేవలం ఊహలు మాత్రమే అంటూ బన్నీ సన్నిహితులు ఈ వార్తలను ఖండిస్తున్నారు..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: