ఉపేంద్ర పేరు చెబితే చాలు.. ఉపేంద్ర, రా, ఏ, కన్యాదానం, హాలీవుడ్.. సినిమాలు గుర్తుకువస్తాయి. ఎందుకంటే ఆ సినిమాల్లో ఆయన నటన అలాంటిది మరీ. యాక్టింగ్ రొటీన్ లా కాకుండా.. కాస్త వెరైటీగా కుర్రకారును ఆకట్టుకునేలా ఉంటుంది. అదే ఆయన్ను ఉన్నత స్థాయికి చేర్చింది.  


కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, శంకర్ లను వెనక్కినెట్టేశాడు. సౌత్ నుంచి సెలక్ట్ అయిన ఒకే ఒక డైరెక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సౌత్ స్టార్ వరల్డ్ టాప్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్నాడు. హీరోగా, డైరెక్టర్ గా ఉపేంద్ర సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. మేజర్ ఆడియన్స్ కు ఉపేంద్ర తీసే సినిమాలు వెర్రిలా అనిపిస్తాయి. కానీ ఇపుడు ఆ వెర్రి కాన్సెప్ట్ లే ఈ కన్నడ స్టార్ ను వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ప్లేస్ దక్కేలా చేశాయి. 


తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించిన ఉపేంద్ర వరల్డ్ టాప్ 20 డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించుకున్నాడు. బీఎండీబీ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను ఎంపిక చేసింది. ఆ జాబితాలో సౌత్ ఇండియా నుండి కేవలం ఉపేంద్రకు మాత్రమే ఛాన్స్ దక్కింది. 50మంది దర్శకులను ఈ సంస్థ ఎంపిక చేస్తే అందులో ఉపేంద్ర 17వ స్థానం దక్కించుకోవడం విశేషం. 


బీఎండీబీ సంస్థ ఎంపిక చేసిన దర్శకుల లిస్ట్ లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీకి రెండో స్థానం దక్కింది. బాలీవుడ్ పాతతరం దర్శకుడు సత్యజిత్ రే కి నాలుగవ స్థానం దక్కింది. ఎందరో గొప్ప కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ ఉపేంద్రకు చోటు దక్కడం వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కేవలం వైవిధ్యమైన చిత్రాలు తీసే దర్శకులను మాత్రమే ఈ సంస్థ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 







మరింత సమాచారం తెలుసుకోండి: