Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 10:55 am IST

Menu &Sections

Search

నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు

నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయ్ రాజా, రాఘవ, రవి శివ, తేజ మెయిన్ లీడ్స్‌గా, ఏ వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం, సుధారామ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కె.ఉమాకాంత్ నిర్మిస్తున్న మూవీ.. ''ఏదైనా జరగొచ్చు..''కె. రమాకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాపులర్ తమిళ నటుడు బాబీ సింహా నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.
రీసెంట్‌గా ఏదైనా జరగొచ్చు టీజర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్  విడుద‌ల చేశారు. ఈ చిత్రం రేపు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంద‌ర్భంగా విలేక‌రులతో చిత్ర డైరెక్ట‌ర్ ర‌మాకాంత్ ముచ్చ‌టించారు. 


ఏదైనా జ‌ర‌గొచ్చు చిత్రం ఓ థ్రిల్ల‌ర్ హార‌ర్ మూవీ. నేను  చంద్ర‌శేఖ‌ర్ ఏలేటిగారి ద‌గ్గ‌ర ప‌ని చేశాను. ఆ త‌ర్వాత ఫ్రాన్స్‌కు వెళ్ళాను. అక్క‌డ కూడా మూడేళ్ళ‌పాటు ఫిల్మ్ కోర్స్ చేశాను. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ తిరిగి ఇక్క‌డ‌కు వ‌చ్చేసి నా ఓన్ ప్రాజెక్ట‌స్ మొద‌లు పెట్టాను.  ముందు ఒక డైరెక్ట‌ర్‌కి ఫ‌స్ట్‌టైం అవ‌కాశం ఇవ్వ‌డం అనేది చాలా క‌ష్టం.  ఒక హీరో అవ‌కాశం ఇవ్వ‌డం అనేది ఇంకా చాలా  క‌ష్టం. ఒక సినిమా చేసి హిట్ అయిఉంటే ఎవ‌రైనా న‌మ్ముతారు. లేదంటే అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. హీరో బేస్డ్ కాకుండా నేను డైరెక్ట‌ర్‌గా ఒక సినిమా చేస్తే బావుంట‌ద‌న్న ఉద్దేశ్యంతో చేశాను. హండ్రెడ్ ప‌ర్సెంట్‌న‌న్ను నేను డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకోడానికే ఈ ప్రాజెక్ట్‌ని మొద‌లు పెట్టాను. ఈ సినిమాలో విజ‌య్‌రాజానే తీసుకోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం అంటూ ఏమీ లేదు. ప‌ర్టిక్యుల‌ర్‌గా హీరో వెల్‌వెట్ అయ్యే చిత్రం కాదు. నేను ఈ క‌థ‌ను చాలా మందికి న్యారేట్ చేశాను. క‌థ చాలా మందికి న‌చ్చింది కానీ సినిమా తియ్య‌డానికి మాత్రం ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ముగ్గురు కుర్రాళ్ళ స్టోరీ  ఈ సినిమాలో ముగ్గురి పాత్ర‌ల‌కి స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఉంటుంది. ఎవ‌రి పాత్ర ఎక్క‌డా త‌క్కువ‌, ఎక్కువ‌లు అనేవి ఉండ‌వు. స్టోరీ న‌చ్చింది. కానీ ఎవ‌రూ తొంద‌ర‌గా ముందుకు రావ‌డం లేదు. దాంతో కొత్త‌వాళ్ళ‌తో చేస్తే బావుంటుంది అన్న స‌మాయంలో వీళ్ళ‌తో చేశాను. నాకు ఎటువంటి ప్రెష‌ర్ లేకుండా చెయ్య‌చ్చ‌ని వీళ్ళ‌తో చేశాను.

టైటిల్‌ని బ‌ట్టి చూసి నా ప‌ర్స‌న‌ల్  స్ట్ర‌గ‌ల్ అని అనుకోవ‌ద్దు. ఇండ‌స్ట్రీలో స్ట్రగ‌ల్స్  అనేవి చాలా కామ‌న్ ఎందుకంటే నేను ప‌దిహేను సంవ‌త్స‌రాల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నాను.  కాని అలా అని ప‌ర్స‌న‌ల్ స్ట్ర‌గ‌ల్‌నుంచి పెట్టిన టైటిల్ కాదు. స్టోరీ లైన్‌వ‌చ్చేసి యాక్సిడెంట‌ల్‌గా ఏప్రిల్ 1వ తారీఖున పుట్టిన‌ ముగ్గురు స్టుపిడ్స్‌  వాళ్ళ‌కు తెలియ‌కుండానే వాళ్ళు ఎలా ఇబ్బందుల్లో ప‌డ‌తారు. వాళ్ళ‌ను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మ‌నం ఫూల్స్ కాదు వాళ్ళ‌తో ఉన్న‌వాళ్ళ‌ను ఎలా ఇబ్బందుల్లో ప‌డేస్తార‌న్న కాన్సెప్ట్‌లో వెళుతుంది. ఈ సినిమా చాలా ప్యూర్ మరియు ఒరిజిన‌ల్ క‌థ ఎక్క‌డా కాపీ కొట్టిన క‌థ మాత్రం కాదు. నేను కేవ‌లం ఆడియ‌న్‌ని ఎంట‌ర్‌టైన్ మాత్ర‌మే చెయ్యాల‌నుకున్నా. ఇది కంప్లీట్ ఫిక్ష‌న్ మూవీ. ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ ఉన్న ల‌వ్ స్టోరీ. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర మీద అటువంటి రా ల‌వ్ స్టోరీని చూసి ఉండ‌రు. బాబీ సింహ చేసే పాత్ర‌కి త‌నైతేనే క‌రెక్ట్ అని సెట్ చేశాను. బాబీ సింహ ముందు చెప్ప‌గానే ఒప్పుకున్నారు. రెమ్యూన‌రేష‌న్ గురించి ఆలోచించ లేదు. క‌థ న‌చ్చితే చాలు త‌ను అవ‌న్నీ కూడా ప‌ట్టించుకోడు. ఇందులో ఏ పాత్ర‌కీ ఎవ‌రూ నాకు ఏమీ స‌జ‌ష‌న్ ఇవ్వ‌లేదు. ఎందుకంటే ప్రొడ్యూస‌ర్లు అంద‌రూ అంతా నామీదే వ‌దిలేశారు. ప్రొడ్యూస‌ర్స్‌కి క‌థ చెప్పాక ఎవ్వ‌రూ ఎటువంటి మార్పులు చెప్ప‌లేదు. ఇదంతా రాసేటప్పుడే అయిపోయాయి. రైట‌ర్స్ నాకు బాగా హెల్ప్ చేశారు. చంద్ర‌శేఖ‌ర్‌గారు కూడా ఈ సినిమా చూశారు. ఆయ‌న‌కు కూడా బాగా న‌చ్చింది. థియేట‌ర్‌లో చూడ‌డం కోసం ఆయ‌న వెయిటింగ్‌. ఆయ‌న నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి టెక్నిక‌ల్‌గా నేను కూడా ఒక మంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమా తియ్యాల‌న్న‌ది నా కోరిక‌. ఆయ‌న గ‌తంలో చేసిన చిత్రాలు కూడా స్క్రీన్‌ప్లే మీదే న‌డుస్తాయి. నేను కూడా అదే పంధాలో వెళ్ళాను. వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో  ఓ మ్యాడ్ డైరెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడు.  ఆయ‌న పాత్ర చాలా స‌ర‌ద‌గా సాగిపోతుంది. ఈ మూడు పాత్ర‌లు న‌టించిన వారిలో విజయ్‌రాజా, వివారాఘ‌వ‌, ర‌విశివ‌తేజ‌, వీరు ముగ్గురు న‌టించారు.

యాక్ష‌న్ సీన్స్ కోసం నాకు 15 ఏళ్ళ అనుభ‌వం ఉండ‌డంతో నేను చాలా మంది స్టంట్ కొరియోగ్రాఫ‌ర్స్‌ని ఫాలోఅయ్యాను. స‌మీర్ గారు ఫైట్స్ అన్నీ చాలా నేచ్చ‌ర‌ల్ చూపించారు.  అజ‌య్ ఘోష్ పాత్ర కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని పాత్ర‌. 15 ఏళ్ళు అయినా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చంద్ర‌శేఖ‌ర్‌గారితో మూడు సినిమాలు చేశాను. చేసింది మూడు సినిమాలే కాని ఎక్స్‌పీరియ‌న్స్‌మాత్రం 10 సినిమాల‌ది ఉంటుంది. సినిమామొద‌ల‌య్యే ముందు ఎక్కువ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేయించేవారు. ఆయ‌న ప్ర‌తి సినిమాకి ఎక్కువ టైం తీసుకునేవారు సంవ‌త్స‌రం అలా ఉండ‌డంతో ఎక్కువ టైం ప‌ట్టేది. ప్రీప్రొడ‌క్ష‌న్‌లో ఆయ‌న‌లాగానే మంచి ఎక్స్ పీరియ‌న్స్‌ని నేను సంపాదించాను. ఇక నాగ‌బాబుగారు కూడా ఈ చిత్రంలో చ‌ర్చ్ ఫాద‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. సినిమా బ‌డ్జెట్ అంతా అనుకున్న‌దానికంటే కాస్త ఎక్కువ‌యింది. సినిమా మొత్తం 50 రోజుల్లో పూర్తిచేద్దాం అనుకున్నాం కానీ 52 రోజులు ప‌ట్టింది. కాస్త రెండు రోజులు పెరిగింది అంతే  . క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. షూటింగ్ మొత్తం హైద‌రాబాద్‌లోనే చేశాం. ఎక్క‌డా మీకు లొకేష‌న్స్‌రిపీట్ అవ్వ‌వు. నాకు బాగా యాక్ష‌న్ అంటే ఇష్టం నెక్స్‌ట్ యాక్ష‌న్ మూవీస్ ప్లాన్ చేద్దామ‌నుకుంటున్నాను. 


k-ramakanth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
`ఉల్లాలా ఉల్లాలా`రొమాన్స్ ఎలా ఉండ‌బోతుంది?
అఖిల్ తో పూజా రొమాన్స్‌... మ‌రీ అంత పారితోషిమా...?
షూటింగ్‌కి రెడీ అంటున్న స‌మంత‌
రాయలసీమ లవ్ లో అంత ప‌వ‌ర్ ఉందా...?
ఆ సినిమా ఆడియో హక్కులు ఫ్యాన్సీ రేటుకు
సంగీత దర్శకుడు పవర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లోనా...?
చేతిలో చెయ్యేసి చెప్పు బావ అస‌లేం చెప్పాడు...?
చేజారిన బ్యాడ్ బాయ్ సాంగ్‌
‘నిశ్శబ్దం’గా వేసే ఈ ఆర్ట్ ఏమిటో తెలుసా...?
ఆసిన్ గారాల ప‌ట్టి...!
మ‌హేష్ మూవీలో పూజా డ్యాన్స్ త‌మ‌న్నా కాద‌ట‌?
పాయ‌ల్‌కు ప్ర‌భాస్ కావాల‌ట‌
శ్రీ‌కాంత్‌కి అంత‌గా న‌చ్చిన పాయింట్ ఏంటో...?
హాలీవుడ్ టు టాలీవుడ్‌...!
క్లాసిక‌ల్లో ల‌వ్‌స‌స్పెన్స్ థ్రిల్ ఉంట‌దా...?
నానికి ఎగ్జైట్‌తో పాటు నెర్వ‌స్‌గా ఉందట‌
రాజ‌మౌళి చిత్రం పై విజ‌య‌శాంతి వివ‌ర‌ణ‌
సైరా సినిమాలో అది హైలెట్‌గా నిలుస్తుంది- సురేంద‌ర్ రెడ్డి
తెలుగు తెర‌కు మ‌రో విజ‌య‌శాంతి దొరికిందంటున్న వి.వి.వినాయ‌క్‌
ఎర్ర‌చీర లోని మాయ తెలుసా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED