సాహో 350 కోట్ల బడ్జెట్ మూవీ. ఈ సినిమా ఈ నెల 30న విడుదల అవుతోంది. ప్రభాస్ సూపర్ స్టార్ డం పెట్టుబడిగా వస్తున్న సాహో మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ఇంటర్నేషన‌ల్ మార్కెట్ ని  ద్రుష్టిలో ఉంచుకుని హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేశారు. చేజింగ్స్, యాక్షన్ సీన్లు అన్నీ రకాల హంగులను ఏర్చి, పేర్చి  మరీ సాహోను తయారుచేశారు. బాలీవుడ్ భామ శ్రధ్ధాకపూర్, శ్రీలంక హాట్ భామ‌ జాక్వాలైన్ వంటి అందగత్తెలను సైతం సాహోలో ముందుంచి మరీ గ్లామర్ మెరుగులు అద్దారు.


అన్ని విధాలుగా అనుకూలమైన ఆగస్ట్ 30న సాహో రిలీజ్ అవుతోంది. వినాయకచవితి సంబరాలు అంబరాన్ని తాకే ఈ సీజన్లో సాహో రావడం అంటే మూవీకి ఏమాత్రం పాజిటివ్ బజ్ వచ్చినా సూపర్ హిట్ అవుతుందన్న లెక్కలు కూడా ఉన్నాయి. ఇక ప్రభాస్ రెండేళ్ళ కష్టం, సుజిత్ డైరెక్షన్, లావిష్ గా నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఖర్చు చేసిన తీరు కూడా సాహో అంచనాలను పెంచేస్తున్నాయి.


అన్నీ కలసివచ్చి సాహో పెద్ద హిట్ అయితే  నమ్మి భారీ బిజినెస్ గా పెట్టిన  350 కోట్లు వెనక్కి తిరిగి రావడం కష్టమేమీ కాదు. సాహో ఒక్క తెలుగులోనే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసింది. మరి ఆ మొత్తం వసూల్ కావాలంటే సాహో గట్టిగా కనీసం నెల రోజులకు మించి ఆడాలి. సరిగ్గా సాహోకు నెల రోజుల తరువాత సైరా మూవీ ఉంది. ఇది 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో మెగా ఫ్యామిలీ రూపొందించింది. . ఈ మూవీ కూడా హిట్ బాట పట్టాలంటే ఓవర్సీస్ వసూళ్ళతో పాటు దేశీయంగానూ మంచి కలెక్షన్లు కుమ్మేయాలి. 


సాహో కనుక ముందు రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే ఆ మానియాలో సైరా కిక్కు ఎక్కుతుందా అన్నది ఒక డౌట్ గా ఉందిట. సాహో జోనర్ వేరు. సైరా జోనర్ వేరు. అదే సాహోకు నెగిటివ్ టాక్ వచ్చి బాక్సాఫీస్ వద్ద చీదేసినా ఆ ప్రతికూల ఫలితం సైతం సైరా మీద ఎంతమేరకు పడుతుందన్న అనుమానాలు కూడా ఉన్నాయట. మొత్తానికి టాలీవుడ్ నుంచి వస్తున్న రెండు భారీ బడ్జెట్ మూవీలు సూపర్ హిట్ అయి బాలీవుడ్, హాలీవుడ్ కి తెలుగు కీర్తి తాకాలని మాత్రం అంతా కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: