మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజంటే అభిమానులకు పండగరోజే అనే చెప్పాలి. ఆగస్టు 22 అంటూనే తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేమికులు మా చిరంజీవి పుట్టినరోజు అని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అంతమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ ట్రెండ్ ని ఫాలో అవుతూ సోషల్ మీడియాలో చిరంజీవి పేరుతో హ్యాష్ ట్యాగ్స్ ని ఉపయోగించి విన్నూతంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


చిరంజీవి అంటే ఇప్పుడు కాదు ఎన్నో శతాబ్దాల నుంచి వీరాభిమానులు ఉన్నారు. అందులో సేవాకార్యక్రమాలు చేసే అభిమానులు అన్నదానం, రక్త దానం అంటూ సేవా కార్యక్రమాలు చేసి వారి వీరాభిమానాన్ని ప్రజలకు చూపిస్తుంటారు. నేడు చిరంజీవి 64వ పుట్టినరోజు దీంతో అందరూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూన్నారు.  


ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రోజు కూడా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక రోజు ముందుగానే శిల్పకళావేదికలో మెగాస్టార్ బర్త్ డే ఈవెంట్ ని భారీగా నిర్వహించారు. ఈ వేడుకకు జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొని చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరు నటించిన సినిమాలలోని పాటలను ప్రముఖ సింగర్స్ ఆలపించగా, ఆయన పాటలకు నృత్య కళాకారులు ఆడిపాడారు. 


ఇక ఈ వేడుకలలో పదవ తరగతి లో 10 కి 10 పాయింట్లు తెచ్చుకున్న విద్యార్థులకు చిరంజీవి మెమొంటోలను అందజేశారు. అనంతరం హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మెగా అభిమానులను కలుస్తున్నానని, ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని తెలిపారు. తమ లాంటి వారందరికీ మెగాస్టార్ చిరంజీవి మామయ్యే ఆదర్శమని, ఆగస్టు 22 న ఒక పెద్ద పండగలా చేసే మెగా అబినులందరికి కృతజ్ఞతలని తెలిపారు. ఆ ఆంజనేయ స్వామి దయ వలన చిరంజీవి మామయ్య సైరా లాంటి ఇంకెన్నో గొప్ప సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నానన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: