యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో దాదాపుగా రూ.350 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి మన తెలుగు సినిమా పరిశ్రమకు ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా తెలుగు సహా అన్ని భాషల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల గ్రాండ్ గా ప్రి రిలీజ్ ఫంక్షన్ జరుపుకున్న ఈ సినిమాను ఈనెల 30వ తేదీన ప్రప్రంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. 

ఇకపోతే ఈ సినిమాకు బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లో జరిగిందని సమాచారం. నిజానికి గతంలో వచ్చిన బాహుబలి మొదటి భాగాన్ని దాటి, చాలా చోట్ల బహుబలి 2 రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరిగిందట. అంతేకాక కొన్ని ప్రాంతాల్లో అయితే, సినిమా హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొందని, ఆ సమయంలో తమ సినిమాను ఎవరికి అమ్మలి అనే విషయమై నిర్మాతలు కొంత సందిగ్ధానికి లోనైనట్లు సమాచారం. ఇక సాహో బిజినెస్ డీటెయిల్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిక పోయినా, అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.340 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు సమాచారం. తెలంగాణ, ఏపీలో కలిపి ఈ  సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.125కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సౌత్‌లోని మిగిలిన భాషల్లో కలిపి రూ.46 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇక హిందీ వెర్షన్ విషయానికొస్తే రూ.120 కోట్లకు హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. 

ఇక వాటితోపాటు డిజిటల్, శాటిలైట్,ఆడియో రైట్స్ రూపంలో మరింత పెద్ద మొత్తంలో ఈ సినిమాకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం, అలానే అత్యంత భారీగా, బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతోనే సాహోకు ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక మరొక ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, ఎంతమేర విజయాన్ని అందుకుని సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: