అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ.. తమిళంలో రాణిస్తున్న హీరోయిన్.. ఐశ్వ‌ర్య‌రాజేష్‌. నటుడు రాజేశ్ కుమార్తెగా 'డాడీ' చిత్రంతో బాలీవుడ్‌లోనూ కాలుమోపిన ఐశ్వర్య. తాజాగా ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌. ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సంద‌ర్భంగా విలేక‌రులతో ఐశ్వ‌ర్య ముచ్చ‌టించారు...


నేను పుట్టిపెరిగిందంతా చెన్నైలోనే. కాని తెలుగు మాట్లాడ‌టం చాలా బాగా వ‌చ్చు. దాదాపుగా 25 చిత్రాల్లో న‌టించాను. అందులో రెండు మ‌ల‌యాళం ఒక‌టి బాలీవుడ్ లో న‌టించాను.  ఓల్డ్ యాక్ట‌ర్ అమ‌ర్‌నాధ్ మా తాత‌గారు. రాజేష్ మా నాన్న‌గారు, అలాగే తెలుగులో క‌మెడియ‌న్  మీ అంద‌రికీ సుప‌రిచితురాలైన శ్రీ‌ల‌క్ష్మి మా అత్త‌య్య‌. నేను న‌టించిన పాత్ర‌ల‌న్నీ దాదాపుగా ఛాలెంజింగ్ రోల్స్‌నే న‌టించాను. నా పాత్రే రోల్ ప్లే చేస్త‌ది. తెలుగులో మంచి చిత్రం న‌టించాల‌న్న ఉద్దేశ్యంతో ఈ చిత్రంతో మీ ముందుకు వ‌చ్చాను. ఆల్‌రెడీ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో ఒక చిత్రంలో న‌టిస్తున్నాను. అందులో న‌లుగురు హీరోయిన్లు ఒక‌రు రాశీఖ‌న్నా, మ‌రొక‌రు, నివేదాథామ‌స్ , నేను కూడా అందులో ఒక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాను. ఆ చిత్రంలో నేను చేసే పాత్ర నాకు బాగా న‌చ్చింది. రామారావుగారు నా క‌ణ చిత్రం చూసి ఆయ‌న‌కు న‌చ్చి న‌న్ను ఈ చిత్రంలో తీసుకున్నారు. మీకు అంద‌రికీ ఈ చిత్రం బాగా న‌చ్చుతుంది. మీరు ఈ చిత్రాన్ని చూస్తే మీకే అర్ధ‌మ‌వుతుంది.  ఈ చిత్రం విషయానికి వ‌స్తే త‌మిళ్ కంటే తెలుగులో ఇంకా బాగా న‌టించాన‌నిపించింది. ఒక‌సారి ఆల్రెడీ న‌టించిన చిత్రం మ‌ళ్ళీ చెయ్య‌డం అంటే కొంత క‌ష్టంగానే అనిపించింది. విజ‌య్‌దేవ‌ర‌కొండ చిత్రం ముందుగా మొద‌లైనా ఆ సినిమా ప‌ని ఇంకా చాలా ఉంది పూర్తి కాక‌పోవ‌డంతో ఈ సినిమా రీమేక్ కావ‌డంతో ఇది త్వ‌ర‌గా పూర్త‌యి మీ ముందుకు వ‌స్తుంది. సీనియ‌ర్ యాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో ఆల్రెడీ రాంబంటులో చిన్న పిల్ల క్యారెక్ట‌ర్  రెండు నిమిషాలు చేశాను.  ఆయ‌న‌తో మ‌ళ్ళీ న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న మా నాన్న‌గారికి క్లోజ్ ఫ్రెండ్ నాకు మా నాన్న‌తో క‌లిసున్న‌ట్లు అనిపించింది. ఈ చిత్రం కోసం క్రికెట్‌ని ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నా రాజ‌మండ్రిలో మంచి ఎండ‌ల్లో ఆడాను. ముగ్గురు కోచ్‌ల‌ను పెట్టుకుని మ‌రీ కోచింగ్ తీసుకున్నాను. నాకు బేసిక్‌గా బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. కాని ఇందులో నేను బౌల‌ర్‌ని గేమ్ మొత్తం బౌలింగ్‌లోనే జ‌రుగుతుంది.  నేను ఈ చిత్రం చెయ్య‌డానికి ప్ర‌ధాన కార‌ణం నాకు స్పోర్ట్స్  ఫిల్మ్‌లో న‌టించాల‌నుండేది అందుకే ఈ చిత్రం లో న‌టించాను. 


మరింత సమాచారం తెలుసుకోండి: