Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 11:42 pm IST

Menu &Sections

Search

అమ్మా .. నాన్న.. ఓ చిరంజీవి !

అమ్మా .. నాన్న.. ఓ చిరంజీవి !
అమ్మా .. నాన్న.. ఓ చిరంజీవి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పొద్దంతా రిక్షా తొక్కి, రాత్రి నేల టికెట్ కొన్న రిక్షావాడు, రోజంతా కూలీ చేసి, వారనికో సినిమా చూసే ఒక కార్మికుడు, నెలంతా కష్టపడి, జీతంలో కొంత భాగంతో కుటుంబాన్ని సినిమా తీసుకెళ్లే ఒక మధ్యతరగతి వాడు, చదువు, పరీక్షలు,ప్రేమ, పేదరికం, అవమానం లాంటి సమస్యలతో బాధపడే ఒక విద్యార్థి... ఆ రోజుల్లో అందరికీ ఒకటే డ్రగ్ ... ఆ డ్రగ్ పేరు "చిరంజీవి"... డబ్భైల్లో , ఎనభైల్లో, తొంబైల్లో పుట్టిన సగటు తెలుగు వాడి జీవితంలో ఆయనో భాగం... ఇరవై రూపాయిలు పెడితే .. ఆ నెల కష్టం మర్చిపోయేలా చేసేవాడు ఆయన సినిమా తో... చిరంజీవి ఉనికిని, చిరంజీవి స్థాయిని, చిరంజీవి స్టామినా ని, చిరంజీవి అనే పేరుని నువ్వు అంగీకరించలేకపోతున్నావ్ అంటే నీ కళ్ళకి అదేదో అడ్డుపడి ఉండాలి.. సినిమా ఇండస్ట్రీ వాడికైనా, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా..


చిరంజీవి జ్ఞాపకాలు చుట్టు ముట్టి ఉంటాయి.. అందుకే వెనక్కి తిరిగి చూసుకుంటే.. అమ్మ, నాన్న, స్నేహితుడు, ప్రియురాలు.. వాటితో పాటు చిరంజీవి ఉంటాడు మన జీవితం లో . . నా బాధ అతని వల్ల సగం అవుతోంది.. నా సంతోషం అతని వల్ల రెట్టింపు అవుతోంది ... నా బాల్యం, యవ్వనం.. వెనక్కి తిరిగి చూసుకుంటే అతని జ్ఞాపకాలు నన్ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి అని చెప్పుకున్న అభిమానులు కోటాను కోట్లు ఉన్నారు. రాళ్లే మాట్లాడ‌తాయి అంటారు .. ఆ రాళ్లే సముద్ర కెరటాల నుంచి ఒడ్డుని కాపాడతాయి.జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని తన జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తూ ఎదిగిన మన కొణిదెల వారి పెద్దోడు ఏ రోజు ఏ సమస్యకి తలొగ్గలేధు భయపడి పారిపోలేదు. జీవితం అంటే ఇలా జీవించాలి ఇలానే ప్రవర్తించాలి ఇలానే బతకాలి అని ఎందరికో చాటి చెప్పాడు. అటువంటి మన గ్యాంగ్ లీడర్ , జగదేక వీరుని కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రంగుల సినిమా ప్రపంచం లో కి తానేదో సాదించేద్దామ్ అని ఒక మామూలు వ్యక్తి గా ఎన్నో కష్టాలు పడి వచ్చి ఈ రోజు ఈ రంగుల సినిమా ప్రపంచానికి ఒక మెగాస్టార్ గా ఎదిగి ఎవరు చేరుకోలేని శిఖరాలను అధిరోహించాడు. తానొక్కడినే ఎదగక టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కర్ని ఎదిగేలా ప్రోత్సహించాడు. ఆయన ఒక మహా వృక్షం లా పెరిగి ఆ వృక్షం లో తన కుటుంబం లో టాలెంట్ ఉన్న అందర్ని కొమ్మలగా తనతో పాటే ఎదగనిచ్చాడు.


ఆయన వారసత్వం తో వచ్చి ఇప్పుడు తెలుగు ప్రేక్షక జనులుతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని పిలిపించుకుంటున్న తమ్ముడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పిలిపించుకుంటున్న కొడుకు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ , సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అని పిలిపించుకుంటున్న మేనళ్ళు లు , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని పిలిపించుకుంటున్న తన తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు ఇలా ఎందరో ప్రేక్షక మన్నలు పొందుతున్నారు. త‌న గురించి అవాకులు చ‌వాకులు పేలే పాండి బజార్ వ‌ద్దన్నాడు.. త‌నకు ఆనందాన్నిచ్చే మెరీనా తీరాన్నే కోరుకున్నాడు. ‘‘ఇప్పటికీ మ‌నం చేయాల్సింది ఇదే.. ఎవ్వరేం మాట్లాడినా మెరీనా తీరంలో ఉన్నామ‌ని అనుకుని ఊరుకోవ‌డ‌మే.. అప్పుడే హాయి’’.. ఇదీ వాడి జీవితం.. ఇదీ వాడి వికాస పాఠం. అవును ఆ క‌వి అన్నాడు క‌దా ‘‘వెన్నెల దీపం కొంద‌రిదా అడ‌వికి సైతం వెలుగు క‌దా!’’ అలానే అత‌డు.. ఎంద‌రికో దారి ఇచ్చాడు.. దారి చూపాడు. తన పై విమర్శలు చేసిన వారిని ఏనాడూ ఏమనలేదు విమర్శలు చేసిన వ్యక్తిని కూడా ఎవరు ఏమనవద్దు అని చెప్పే ఒకే ఒక అహం లేని గర్వం లేని వ్యక్తి మన మెగాస్టార్.


ఏనాడూ తన సినిమా విజయాలకి ఉప్పొంగలేదు అపజయా లకి క్రుంగిపోలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఇండస్ట్రి హిట్స్ కొట్టిన బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ వచ్చిన మొహం లో చిరునవ్వు ని ఎప్పుడు వదలలేదు ఎప్పుడు చిరునవ్వులతో నే ఉన్నారు మన చిరంజీవి. ఒక్కసారి గా ఆయన ఓవర్ నైట్ స్టార్ గా ఎదగలేదు. నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా శ్రమిస్తూ తను చేస్తున్న రంగం పై ఇష్టం తో పని చేశాడు. ఆయన ఉన్న క్రమశిక్షణ పని పట్ల ఉన్న నిబద్దత, కష్టం,సహయం చేసే గుణం , ఎప్పుడు ఎవర్ని విమర్శించని గుణం సినిమా పట్ల ఆయనకున్న అభిమానం ఇంత కష్ట పడ్డాడు కాబట్టే ఈ రోజు ఆయన ఒక మెగాస్టార్ తెలుగు సినిమా ప్రపంచానికి ఒక రాజు. ఎప్పటికీ డాన్స్ లో ఆయనే నెంబర్ వన్ అనిపించుకున్నాడు. ఇప్పటికీ హీరో అంటే చిరంజీవే రా ఆయన తర్వాతే ఎవరన్నా అనే భావన కల్పించాడు. చిరంజీవి తెలియని జనాలు లేరనెంత గా ఎదిగాడు మన కొణిదెల శివశంకర్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. అక్టోబర్ 2 రిలీజ్ అవుతున్న తన డ్రీమ్ ప్రాజెక్టు సినిమా సై రా నరసింహ రెడ్డి గొప్ప విజయం సాధించాలని తెలుగువాడి గొప్పతనం ప్రపంచమంత తెలియాలని కోరుకుంటున్నాను. ఇన్నేళ్ల కెరియ‌ర్‌లో అత‌డు సాధించింది ఎంతో. ఆయ‌నే అన్నట్లు సాధించారు .. సాధించాల్సిందీ ఎంతో! ఈ జ‌న్మదిన వేళ ఆయ‌న‌కు అభినంద‌నలు..64 వ జన్మదిన శుభాకాంక్షలు.


chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING