నిరంతరం సంచలనాలకు చిరునామా కొనసాగే రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలకు ఎక్కాడు. ఎవరు ఊహించని విధంగా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న యాక్టర్‌ ఫోటోని తన  ట్విటర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అన్న సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే.   

మహేష్ బాబు పుట్టినరోజునాడు ఈ సినిమా పాట విడుదల చేసిన వర్మ ఇప్పడు చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాలో పవన్ పాత్రను పోషిస్తున్న అచ్చం పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఒక యాక్టర్‌ ఫోటోని ట్విటర్ ద్వారా పోస్ట్  చేసి మరో సారి సంచలన వార్తలలో నిలిచాడు. పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఈ యాక్టర్ ని చూపిస్తూ ఇతడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏ రోల్ లో నటిస్తున్నాడో గుర్తుపట్టండి’ అని కామెంట్ పెట్టాడు వర్మ.  

అయితే పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఆ వ్యక్తి  ఎవరు అన్న వివవరాలు బయటకు రాకపోవడంతో ఆ నటుడు గురించి వివరాలు తెలుసుకోవడానికి పవన్ అభిమానులు తీవ్ర శోధన చేస్తున్నారు. అంతేకాదు వర్మ నిన్న లీక్ చేసిన ఈ ఫోటోను బట్టి వర్మ లేటెస్ట్ మూవీలో పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే చాల అంశాలు ఉండబోతున్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ మూవీలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి వర్మకు చిరంజీవి పవన్ లపై చాల అసహనం ఉంది. ఇప్పుడు ఈ అసహనం వర్మ లేటెస్ట్ మూవీలో పవన్ పై సెటైర్లుగా మారితే పవన్ వీరాభిమానుల దృష్టి ఈ సినిమా పై పడటమే కాకుండా వారంతా ఈ సినిమాను ఖచ్చితంగా వచ్చి చూస్తారు అన్న వ్యూహంతో వర్మ ఇలా నకిలీ పవన్ కళ్యాణ్ ను సృష్టించాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: