శ్రీక్రిష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, ఆయన రూపు రేఖలు జనం వూహలకు అందనివి. పండితులు, మేధావులు పురాణాల్లో వర్ణించిన దాన్ని బట్టి ఒక రూపం ఏర్పాటు చేసుకున్నా సాదర జనానికి మాత్రం క్రిష్ణుడు అంటే ఎలా ఉంటాడు అన్నది తెలియదు. నల్లగా  ఉంటాడని, కొంటె చూపుల వాడని అందరూ అంటున్నా క్రిష్ణుడు అందగాడేనన్నది నిరూపించిన మహానుభావుడు ఒకరున్నారు.


ఆయనే  నందమూరి తారకరామారావు. రామారావుకు క్రిష్ణుడికి ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు కానీ ఆయన జీవితంలో దాదాపుగా 20 కి తక్కువ లేకుండా చిత్రాలలో  క్రిష్ణ పాత్రలు వేశారు. ఆయన నడచివస్తూంటే శ్రీక్రిష్ణుడు వచ్చినట్లే ఉంటుంది. ఆయన నవ్వితే క్రిష్ణుడు ఇలాగే నవ్వుతారని అనుకున్నారంతా. శ్రీక్రిష్ణుడు ఎంతటి గొప్పవాడో కూడా ఆయన సినిమాల ద్వారానే తెలుసుకున్నారు.


శ్రీక్రిష్ణుడుగా రామారావు తప్ప ఎవరూ సరిసాటి కారు అన్నది తరువాత రోజుల్లో వచ్చిన కీర్తి. అయితే రామారావు మొదటిసారిగా క్రిష్ణుడిగా వేసిన చిత్రం సొంత వూరు. అది అమరగాయకుడు ఘంటసాల  నిర్మించిన చిత్రం. అందులో మొట్ట మొదటిసారిగా క్రిష్ణుడి వేషం కట్టారు నందమూరి. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అందులో క్రిష్ణుడిగా రామారావుని చూసిన వారు ఈయనేంటి, ఈ వేషమేంటి. అసలు సూటు కారు అనేశారు


ఆ దెబ్బకు షాక్ తిన్న అన్న గారు ఇక జీవితంలో ఆ పాత్ర చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే 1957 టైంలో మాయాబజార్ తీస్తున్నారు. దాంట్లో క్రిష్ణ పాత్రకు కేవీ రెడ్డి అన్న గారిని ఎంపిక చేశారు. ఆయన ససేమిరా అన్నా కూడా నీవే క్రిష్ణుడు అన్నారు. అలా గొప్పగా ఆ పాత్రను డిజైన్ చేసి జనంలోకి వదిలారు. అంతే ఇక రామారావుకు తిరుగులేదు. క్రిష్ణుడుగా ఆయన తప్ప ఎవరూ లేరు అన్న గొప్ప పేరును సంపాదించుకున్నారు.


ప్రతీ వారి గుండెల్లో ఇపుడు క్రిష్ణుడు అంటే అన్న గారే గుర్తుకు వస్తారంటే ఆయనకు ఆ పరమాత్మ దయ ఎంతలా ఉందో అర్ధమవుతుంది. శ్రీక్రిష్ణుడిగా రామారావు అతికిన‌ట్లుగా సరిపోవడానికి కారణం ఆయన శ్రధ్ధ, పాత్ర మీద నిష్ట. అభినయం, భయంమ్ భక్తి అన్నీ, అందుకే తారకరాముడు క్రిష్ణుడిగా సార్ధక నామధేయుడయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: